గుజరాత్ లో ముగిసిన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

గుజరాత్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైనట్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.89 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 1న పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.కాగా గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఈనెల 8వ తేదీన విడుదల కానున్నాయి.పోలింగ్ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలి వచ్చారు.

 Polling For The Second Phase Of Assembly Elections Has Ended In Gujarat-TeluguStop.com

అయితే గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొందని చెప్పొచ్చు.దాదాపు మూడు దశాబ్ధాలుగా గుజరాత్ ను పాలిస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలనే యోచనలో ఉంది.

అదేవిధంగా తమ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కూడా తీవ్రంగా శ్రమించాయి.ఈ నేపథ్యంలో గుజరాత్ లో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube