ఒక్క మహిళ కోసం పోలింగ్‌ బూత్‌, గ్రామంలో ఇతరుల పరిస్థితి ఏంటి మరి?

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్‌ నడుస్తోంది.దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.

 Polling Booth For One Lady-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఎన్నికల సిత్రాలు ఎన్నో కనిస్తూనే ఉన్నాయి.తాజాగా ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు, ప్రచారం చేస్తున్నారు.

దేశ భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా ఓటర్లకు ఎన్నికల కమీషన్‌ అధికారులు సూచిస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజాస్వామ్యం తమకు కల్పించిన హక్కును ఎన్నికల అధికారుల సాయంతో వినియోగించుకునేందుకు ప్రతి ఒక్క ఓటరు కూడా సిద్దం అవ్వాలని ఈ సందర్బంగా ప్రజా సంఘాల వారు అంటున్నారు.ఇక ఎన్నికల అధికారులు ఎంతో కష్టపడి మనకోసం ఏర్పాట్లు చేసినా కూడా కొందరు ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్న గ్రామంలో కూడా ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రంను ఏర్పాటు చేయబోతున్నారు.ఆమెకు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు ముగ్గురు పోలింగ్‌ అధికారులు మరియు, ఇద్దరు సెక్యూరిటీ ఆఫసర్లు మొత్తం అయిదుగురు ఒక్క ఓటరు కోసం రోడ్డు కూడా సరిగా లేని ఊరుకు వెళ్తున్నారు.

వచ్చే వారంలో జరుగబోతున్న మొదటి విడత ఎన్నికల్లో చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అంజ్వా జిల్లా, మాలోగాం గ్రామం ఉంది.ఆ గ్రామంలో జనాబా చాలానే ఉన్నా ఎక్కువ శాతం వివిధ ప్రాంతాల్లో తమ ఓట్లను నమోదు చేసుకున్నారు.కాని ఆ గ్రామానికి చెందిన 39 ఏళ్ల సొకేలా మాత్రమే గ్రామంలో ఓటరుగా నమోదు అయ్యింది.ఆమె ఒక్క దాని కోసం ఎన్నికల అధికారులు అక్కడ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు.

దేశంలోని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె కోసం కూడా అక్కడకు వెళ్లి మరీ పోలింగ్‌ కేంద్రంను ఏర్పాటు చేయబోతున్నట్లుగా జిల్లా అధికారులు ప్రకటించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోసం ఎంత ఖర్చు పెట్టి, ప్రతి ఒక్కరితో ఓట్లు వేయించేందుకు ఎంత కష్టపడుతుందో చూడండి.ప్రతి ఒక్కరి హక్కును కాపాడాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తుంది.కాని మనలో చాలా మంది మాత్రం ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు బద్దకిస్తున్నాం.

మనకు ఇచ్చిన, దక్కిన అద్బుతమైన ఆయుదంను వినియోగించుకోవడం లేదు.ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి, ఓటు వేయని వాడు బతికి ఉన్నట్లు లెక్క కాదు.

అందుకే ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube