అంపైర్లు పై అసహనం ప్రదర్శించిన పోలార్డ్... మ్యాచ్ ఫీజులో కోత  

Pollard Performing An Impatience On The Umpires Cutting Match Fee -

తన కోపమే తనకు శత్రువు…తన శాంతమే తనకు రక్ష అన్న సామెత వినే ఉంటారు.కోపం తో వ్యవహరించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పోలార్డ్ కు మ్యాచ్ ఫీజు లో కోత విధించినట్లు తెలుస్తుంది.

Pollard Performing An Impatience On The Umpires Cutting Match Fee

ఆదివారం ఉప్పల్ మైదానంలో ముంబై ఇండియన్స్,చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్ గా ముంబై నిలిచింది.

అయితే ఆదివారం జరిగిన మ్యాచ్లో అంపైర్ల పై అసహనం వ్యక్తం చేయడం వల్ల పోలార్డ్ కు 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించినల్టు తెలుస్తుంది.బ్రావో వేసిన చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న పోలార్డ్.

అంపైర్ల నిర్ణయం పట్ల తనదైన స్టయిల్లో నిరసన వ్యక్తం చేశాడు.

ఆ ఓవర్లో బ్రావో వరుసగా రెండు బంతులను ఆఫ్సైడ్ వేశాడు.

సైడ్లైన్ బయట బంతులు పడినా ఫీల్డ్ అంపైర్ వాటిని వైడ్గా ప్రకటించలేదు.దీంతో చిర్రెత్తిన పొలార్డ్ తన బ్యాట్ ను గాలిలోకి విసిరేశాడు.ఆ తర్వాత బ్రావో మరో బంతి వేసేందుకు లైనప్ తీసుకోగా.పోలార్డ్ వికెట్లను వదిలేసి చాలా దూరంగా స్ట్రయికింగ్ తీసుకున్నాడు.

దీంతో కాసేపు పొలార్డ్, ఫీల్డ్ అంపైర్ల మధ్య వాగ్వాదం జరిగింది.దీనితో క్రమశిక్షణ చర్యల క్రింద పోలార్డ్ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో పొలార్డ్ అజేయంగా 41 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pollard Performing An Impatience On The Umpires Cutting Match Fee- Related....