రాహుల్ తో రాజకీయం ! బీజేపీ కి పోటీగా తెలంగాణ కాంగ్రెస్ ఎత్తులు

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా నిర్వహించారు.బిజెపి జాతీయ పెద్దలంతా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

 Politics With Rahul Telangana Congress Steps Up To Compete With Bjp Details, Telangana Congress, Aicc,pcc,ktr,sirisilla, Congress Youth Declaration, Aicc,kc Venugopal,telangana Bjp, Bandi Sanjay, Clp Bhatti Vikramarka,rahul Gandhi, Modi, Ktr-TeluguStop.com

ఈ మేరకు తెలంగాణ బిజెపి నాయకులు భారీగా ఏర్పాట్లు చేయడం, జన సమీకరణ చేయడంలో సక్సెస్ కావడంతో బిజెపి సమావేశాలు విజయవంతం అయ్యాయి.ఇక బిజెపి పెద్దలు తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటూ శపధాలు చేశారు.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరును ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మెచ్చుకున్నారు.ఈ ఉత్సాహంతో బిజెపి కాంగ్రెస్ లపై పట్టు సాధించేందుకు తెలంగాణ బిజెపి నాయకులు వ్యూహాలు పన్నుతుండగా, ఇప్పుడు బిజెపికి ధీటుగా కాంగ్రెస్ సైతం తెలంగాణలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 Politics With Rahul Telangana Congress Steps Up To Compete With BJP Details, Telangana Congress, Aicc,pcc,ktr,sirisilla, Congress Youth Declaration, Aicc,kc Venugopal,telangana Bjp, Bandi Sanjay, Clp Bhatti Vikramarka,rahul Gandhi, Modi, Ktr-రాహుల్ తో రాజకీయం బీజేపీ కి పోటీగా తెలంగాణ కాంగ్రెస్ ఎత్తులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిలో భాగంగానే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకురాబోతున్నారు.కొద్దిరోజుల క్రితం వరంగల్ డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.ఈ సభలో రాహుల్ ప్రసంగం ఆకట్టుకోవడంతో పాటు, భారీగా జన సమీకరణ చేయడం, వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ప్రజల్లోనూ చర్చనీయాంశం కావడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి మరింత దోహదం చేయడం , ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ బిజెపి ల నుంచి కాంగ్రెస్ లో చేరే నాయకుల సంఖ్య పెరుగుతుండడంతో , మరోసారి రాహుల్ ను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.అయితే ఈ సభను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఈ సభకు రాహుల్ వస్తున్నట్లుగా ఏఐసిసి జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ సైతం నిర్ధారించారు.రైతు డిక్లరేషన్ తరహాలోనే యూత్ డిక్లరేషన్ పేరుతో మరొక కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 17న రాష్ట్ర విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.అయితే అదే రోజున రాహుల్ ను రాష్ట్రానికి తీసుకువచ్చి సిరిసిల్లలో సభను ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

ఈ సభ నిర్వహణ ఏర్పాట్లు కు సంబంధించి నిన్ననే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీ సంస్థ వ్యవహారాల ఇన్చార్జి కేసి వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube