తెలంగాణలో బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు.
వారసత్వ రాజకీయాలను బీజేపీ అంతం చేస్తుందని జేపీ నడ్డా తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ప్రజాధనం లూఠీ చేశారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ పై కేసీఆర్ వ్యాట్ ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు.ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో తెలంగాణలో ప్రజాపాలన రావాలని జేడీ నడ్డా తెలిపారు.