ప్రధాని మోడీ సభలతో బెంగాల్లో వేడెక్కనున్న రాజకీయాలు....  

Politics In West Bengal Are Getting Heat By Pm Modi Speeches-

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తన ఎన్నికల ప్రచారాన్ని పశ్చిమబెంగాల్లో నిర్వచించనున్నారు.పశ్చిమబెంగాల్లోని ఉత్తర భాగంలో వుండే సిలిగురి మరియు దక్షిణ కొలకత్తాలలో జరిగే బహిరంగ సభల్లో అయన పాల్గొంటారు..

Politics In West Bengal Are Getting Heat By Pm Modi Speeches--Politics In West Bengal Are Getting Heat By PM Modi Speeches-

లెఫ్ట్ పార్టీలు అధికారంలో వున్న రోజుల నుండి బెంగాల్లో తన పట్టు నిరూపించు కొనేందుకు బాజాపా ప్రయత్నిస్తునే ఉంది.

ఓట్ల శాతాన్ని పెంచుకోగలుగుతుందే గానీ అధికారనికి చేరువ కాలేక పోతుంది.ఈ దఫా ఎలాగైనా మొత్తం 42 సీట్లలో 23 సీట్లను సాధించాలని, బాజాపా అధ్యక్చుడు అమిత్ షా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించాడు.అందుకు అనుగుణంగా ప్రధాని మోడీ ఎన్నికల సభలను ఏర్పాటు చేస్తున్నారు.

బెంగాల్ లో బాజాపా ఎదుగుదలను చూసి అధికార త్రుణుమాల్ కాంగ్రెస్స్ కూడా జాగ్రత్త పడుతుంది.కమ్యూనిస్టులు మరియు కాంగ్రెస్స్ బలహీన పడటం వలన ఎదురేలేదనుకొన్న టి.

యం.సి.కి బాజాపా భయం పట్టుకొంది..

దీనికి తోడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఉవ్విళ్ళు ఊరుతున్న త్రుణుమాల్ అధినేత మమతా బెనెర్జీ బాజపాని ప్రధాన ప్రత్యర్ధిగా పరిగణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.సిలిగురిలో మధ్యాన్నం 1 గం కి ప్రధాని ఎన్నికల ర్యాలి ముగిసిన మిమ్మట అదే ప్రాంతానికి చెందిన కూచ్ బేహార్ లో మధ్యాన్నం 3 గం కి మమతా బెనర్జీ సభ మొదలవుతుంది.వాస్తవంగా ఆమె సభ రేపు జరగాల్సి ఉన్నప్పటికీ మోడీ సభని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందుకు జరిపారు.దీనిని బట్టి మమతా,భాజపా ని చూసి ఎంత భయపడుతోందో అర్ధమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

8 ఏళ్ళుగా అధికారంలో వుండటం వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత తో పాటుగా, అధికార దుర్వినియోగం, కార్యకర్తల ధన, కండ బలం, శాంతి భద్రతల సమస్యలు మమత కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.