ఏపీ రాజకీయాలపై కేసీఆర్ మౌనం ! వెనుక రాజకీయం ఇదేనా ?

ఏపీ రాజకీయాల్లో వేలుపెడతా, టీడీపీ అధినేత చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ తెలంగాణాలో అధికారం దక్కించుకున్న వెంటనే కేసీఆర్ చెప్పిన మాటలవి.కానీ ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.

 Politics Behind Kcr Silent On Ap Politics-TeluguStop.com

ఏపీ లో వైసీపీ విజయానికి కృషిచేస్తా అని చెప్పిన ఆయన ఏపీలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటా అంటూ చెప్పుకొచ్చాడు.అంతే కాదు తెలంగాణ మంత్రి, యాదవ సామజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కూడా రంగంలోకి దింపి చంద్రబాబు ని తిట్టించాడు.

ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండడం ఏంటో ఎవరికీ అంతుపట్టడంలేదు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మికి కృషి చేయ‌డ‌మే కేసీఆర్ ఇచ్చే గిఫ్ట్ అని అంతా భావించారు.ఫెడ‌రల్ ఫ్రంట్ లో క‌ల‌వాల్సిందిగా కేటీఆర్ వెళ్లి జ‌గ‌న్‌ను రిక్వెస్ట్ చేయడం, టీఆర్ఎస్ నేత‌లు జ‌గ‌న్‌కు అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం ఇందులో భాగంగానే జరిగాయి.‌అయితే తెలంగాణ‌లో త‌న‌కు వ్య‌తిరేకంగా కేసీఆర్ రెచ్చ‌గొట్టిన సెంటిమెంట్ ను ఏపీలో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టి లాభ‌ప‌డాల‌ని చంద్రబాబు భావించారు.

కేటీఆర్ జ‌గ‌న్‌ను కలిసిన దగ్గర నుంచి బాబు వ్యూహం మార్చేశాడు.అప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ మోడీ కుట్ర‌లు చేస్తున్నార‌న్న టీడీపీ దానిలోకి కేసీఆర్‌ను కూడా చేర్చేసారు.

ఆ ముగ్గురూ కలిసి ఎన్నికల ప్రచారానికి దిగితే తనకు ముప్పే అని భావించిన బాబు ఏపీలో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు.రోషం, పౌరుషం, ఆత్మ‌గౌర‌వం అంటూ కొత్త కొత్త నినాదాలు పలుకుతూ సెంటిమెంట్ అస్త్రాన్నిబలంగా ప్ర‌యోగిస్తున్నారు.దీంతో సెంటిమెంట్ బ‌లం బాగా తెలిసిన కేసీఆర్ ఏపీ ఎన్నిక‌ల‌పై కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.కేసీఆర్ కు వ్యతిరేకంగా బాబు, పవన్ ఏమి మాట్లాడినా టీఆర్ఎస్ నుంచి ప్రతిస్పందన రావడంలేదు.

తాము గట్టిగా స్పందిస్తే ఆ ఎఫెక్ట్ జగన్ పార్టీ మీద ఎక్కడ పడుతుందో అని కేసీఆర్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.ఇది పసిగట్టే పవన్, బాబు ఇద్దరూ అటు జగన్ మీద, కేసీఆర్ మీద విమర్శలు బాగా చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube