రాజకీయంగా ఫోకస్ అవుతున్న షర్మిల..అసలు వ్యూహం ఇదే?

తెలంగాణ రాజకీయాలలోకి ఎవరూ ఊహించని విధంగా వై.ఎస్.షర్మిల సడెన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తరువాత వరుసగా ఒక్కో జిల్లా స్థాయి నేతలతో సమావేశమై పార్టీ ఏర్పాటు చేస్తే క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయానే విషయం నాయకుల నుండి అభిప్రాయాలు తెలుసుకుంది.

 Politically Focused Sharmila Is This The Real Strategy-TeluguStop.com

అయితే మెజారిటీ నేతలు పార్టీ ఏర్పాటుకు చక్కటి అవకాశాలు ఉన్నాయని తెలపడంతో ఇక పార్టీ ఏర్పాటు అడుగులను మరింత వేగవంతంగా చేసింది.అయితే ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన షర్మిల ఆ సభలో పార్టీ పేరును, పార్టీ జెండాను ప్రకటిస్తుందని అందరూ ఆశ పడ్డారు.

కాని జులై 8 న పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పి వైఎస్ అభిమానులకు ట్విస్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది.అయితే ప్రకటన వాయిదా వెనుక రకరకాల విషయాలను ప్రచారంలో ఉంచారు.

 Politically Focused Sharmila Is This The Real Strategy-రాజకీయంగా ఫోకస్ అవుతున్న షర్మిల..అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఖమ్మం సభ తరువాత షర్మిల ప్రభుత్వాన్ని విమర్శించడంలో తన స్పీడ్ పెంచిందని చెప్పవచ్చు.ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా షర్మిల మారింది.

అయితే ఇంత సడెన్ గా షర్మిల దీక్షల వెనుక ఉన్న వ్యూహం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మెల్లగా బలపడుతున్న పరిస్థితులలో షర్మిల పార్టీని హైలెట్ చేస్తే క్రమక్రమంగా ప్రజలు బీజేపీని మర్చిపోయి రాజకీయాలు మొత్తం షర్మిల గురించి మాట్లాడుకునేలా చేయడం వల్ల బీజేపీ తాను ఎంతగా ప్రచారం చేయాలని చూసిన ప్రజలు దృష్టి మరల్చడం సాధ్యం కాదు కాబట్టి ఎలాగు షర్మిలకు క్యాడర్ లేదు కాబట్టి బీజేపీ తన ప్రాబల్యం పెంచుకున్నా ప్రజలలోకి చొచ్చుకెళ్లడం సాధ్యం కాదు.కాబట్టి బీజేపీ సత్తా చాటే అవకాశం కోల్పోతుంది.

#Sharmila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు