తెలంగాణ రాజకీయాలలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పేలుతున్న మాటలతూటాలతో విభేదాలు తారా స్థాయికి చేరిన పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ ను టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది.
అయితే ప్రధాని మోడీ పర్యటనతో ఇక మరింతగా బీజేపీకి, టీఆర్ఎస్ కు రాజకీయ వైరం అనే ఒక బలమైన గీత అనేది ఏర్పడింది.
అయితే రాజకీయంగా పెద్ద ఎత్తున వైరం కొనసాగిస్తున్న కెసీఆర్ దేశ వ్యాప్తంగా బీజేపీపై పోరాటం చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే రాష్ట్రంలో దేశంలో బీజేపీపై పోరాటం చేయడం ద్వారా ఎంతో కొంత వ్యతిరేకత అనేది బీజేపీపై సృష్టించడం ద్వారా దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించవచ్చుననే ఆలోచన కెసీఆర్ మదిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ తో కెసీఆర్ వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు వెళ్ళే ఆలోచనను పరోక్షంగా తెలియజేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
అయితే టీఆర్ఎస్, బీజేపీ వైరం అనేది కాంగ్రెస్ ను ప్రజల్లో కనుమరుగు చేయడానికి చేస్తున్న వ్యూహం అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఇప్పటికే అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించుకుంటూ ప్రణాళిక బద్దంగా అడుగులేస్తున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా టీఆర్ఎస్, బీజేపీ వైరం అనేది వ్యూహాత్మక ఎజెండానా లేక అసలుసిసలు రాజకీయ వైరమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.