బాలయ్య అల్లుళ్ల మధ్య పొలిటికల్ వార్ ! లోకేష్ పై భరత్ గుర్రు ?

ఎన్నికల తంతు ఏపీలో ముగిసిపోయింది.రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్న రేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నా మొత్తానికి కథ అయితే ముగిసింది.

 Political War Between Balakrishna Nephews-TeluguStop.com

కానీ ఆ తాలూకా ప్రకంపనలు మాత్రం ఇంకా పెరుగుతూ పోతున్నాయి.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ నాయకులు, కొన్ని కుటుంబాల మధ్య ఇది పెద్ద చిచ్చే పెట్టేసింది.

నారా లోకేష్ – ఆయన తోడల్లుడు భరత్ మధ్య ఎన్నికల చిచ్చు ఇప్పుడు రాజుకుంది.దీని కారణంగా ఇరు కుటుంబాల మధ్య వైరం బాగా పెరిగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి వివరాలు పరిశీలిస్తే విశాఖ టీడీపీ అభ్యర్థిగా భరత్‌ను చివరి నిమిషంలో ఖరారు చేశారు.

మొదటి నుంచి ఆ టికెట్ తనకు కేటాయించాలని భరత్ కోరుతూ వస్తున్నాడు.

కానీ ఆ సీటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు.అందులో భాగంగా లీకులు ఇచ్చారు.

అయితే పార్టీ కేడరే కాదు.సోషల్ మీడియా బాబు, జేడీ జోడిపై విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో జేడీ కూడా వెనక్కి తగ్గి జనసేన పార్టీలో చేరారు.

జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన లక్ష్మి నారాయణ కు టీడీపీ లోపాయకారిగా సహాయం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు లోకేష్ కూడా టీడీపీ ముఖ్య నేతలకు ఫోన్ చేసి లక్ష్మీనారాయణకు ఓటు వేయాలని చెప్పారట.

దీంతో టీడీపీ కేడర్ జనసేన కు అంతర్గతంగా సహకరించారని భరత్ అనుమానిస్తున్నాడు.

బాబు , లోకేష్ స్కెచ్ తో శ్రీభరత్ పొజిషన్ మూడో ప్లేస్‌కు పడిపోయినట్టు అనేక సర్వేలు తేల్చడం భరత్ లో ఆందోళన పెంచుతోందట.మంత్రి గంటాతో పాటు అందరూ ఎమ్మెల్యేలు శ్రీభరత్‌ను వాడుకున్నారు.తీరా ఓట్లు దగ్గర కి వస్తే మాత్రం పక్కనపెట్టేశారని భరత్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈవిషయం గమనించిన శ్రీ భరత్ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద కారాలు మిర్యాలు నూరుతున్నాడట.సొంత బందువునైనా నాకే ఇలా వెన్నుపోటు పొడుస్తారా అంటూ మండిపడుతున్నాడట.అంతే కాదు ఎన్నికల అనంతరం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న వీకెండ్ పార్టీకి కూడా భరత్ డుమ్మా కొట్టేసాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube