కేసీఆర్‌తో పీకే మీటింగ్‌...? మిష‌న్ 2024లో క‌లుపుకోవ‌డానికేనా!

దేశ‌రాజ‌కీయాల్లో ప్ర‌శాంత్ కిషోర్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.ఆయ‌న వ్యూహం ప‌న్నితే ప్ర‌త్య‌ర్థులు గ‌ల్లంతు కావాల్సిందే.

 Political Strategy Behind Prasanth Kishore Meeting With Cm Kcr-TeluguStop.com

ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున బాధ్య‌త‌లు తీసుకున్నా దాన్ని గెలిపించేదాకా నిద్ర‌పోరు.అలాంటి దిట్ట అయిన ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత వ్యూహ‌క‌ర్తగా ప‌నిచేయ‌బోనంటూ ప్ర‌క‌టించేశారు.

అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ప్లాన్ వేశారు.

 Political Strategy Behind Prasanth Kishore Meeting With Cm Kcr-కేసీఆర్‌తో పీకే మీటింగ్‌… మిష‌న్ 2024లో క‌లుపుకోవ‌డానికేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా అన్ని పార్టీల‌ను క‌లిపి ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను క‌లిసి మూడు గంట‌ల‌కు పైగా దేశ రాజకీయాలపై చ‌ర్చించారు.ఈ క్ర‌మంలో దేశంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న మోడీకి ధీటుగా ప్ర‌తిప‌క్షాన్ని బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా మిష‌న్ 2024ను మొద‌లు పెట్టారు.ఈ కూట‌మిలో ప్ర‌తిపక్షాల‌ను చేర్చి బీజేపీని గ‌ద్దె దించాల‌ని భావిస్తున్నారు.

ఇక కేసీఆర్ కూడా బీజేపీకి వ్య‌తిరేకంగానే ప‌నిచేస్తున్నారు.డైరెక్టుగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇక పీకే కూడా కేటీఆర్‌తో ఇప్ప‌టికే ప‌లుమార్లు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్టు స‌మాచారం.పీకే అంచ‌నా ప్ర‌క‌రాం క‌చ్చితంగా కేసీఆర్ కూట‌మిలో చేర‌తారు.

ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీజేపీ బ‌ల‌ప‌డకుండా చూసేందుకు ప్ర‌తిప‌క్ష కూట‌మిలో చేరేందుకు కేసీఆర్ కూడా సుముఖ‌త చూపుతున్నారంట‌.

Telugu And Kcr, Behind Prasanth Kishore Meeting, Cm Kcr, Corona Second Wave, Front Against Bjp, National Politics, Ncp Sharad Pawar, Political Strategy, Prasanth Kishore And Kcr, Prashanth Kishor-Telugu Political News

ఇందులోభాగంగా త్వ‌ర‌లోనే కేసీఆర్‌తో పీకే స‌మావేశం కాబోతున్నారంటూ వార్తలు వ‌స్తున్నాయి.ఇక జ‌గ‌న్ బీజేపీతోనే దోస్తీ చేస్తున్నారు.మ‌రి ఆయ‌న పీకే ఆహ్వానాన్ని ఒప్పుకుంటారా లేదా అని చూడాలి.

ప్ర‌స్తుతం కొవిడ్ రెండోవేవ్ ప్ర‌భావం బీజేపీకి తీవ్ర వ్య‌తిరేక‌త తీసుకొచ్చింది.దీంతో ఈ వ్య‌తిరేక‌త‌ను ఆధారంగా చేసుకుని బీజేపీకి చెక్ పెట్టేందుకు పీకే ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు.

అయితే మోడీని ఢీకొట్టే బ‌ల‌మైన నేత కోసం పీకే అన్వేషిస్తున్నారు.చూడాలి మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫలిస్తాయో.

#And KCR #CM KCR #BehindPrasanth #PrasanthKishore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు