రాజకీయ నేతల్లో పెరిగిన పీకే డిమాండ్?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు మరోసారి మారుమోగుతోంది.ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

 Political Strategist Prasanth Kishor Playing Key Role In Congress Party Gujarat-TeluguStop.com

అయితే గతంలోనే ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం సాగినప్పటికీ కొన్ని విభేదాల కారణంగా అందులో చేరలేదు.కానీ తాజాగా కాంగ్రెస్ ముఖ్యనాయకులు రాహుల్ గాంధీ మల్లిఖార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ లతో పీకే సమావేశమయ్యారు.

దీంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది.

వచ్చే సంవత్సరంలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి ఈ సమావేశంలో ప్రధానంగా గుజరాత్ లో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది.

గుజరాత్ ఎన్నికలతో పాటు వచ్చే సార్వ్రతిక ఎన్నికలపై కూడా వ్యూహం గురించి చర్చించినట్లు సమాచారం.అయితే ఇప్పటి వరకు ఆయా పార్టీల తరుపున పనిచేసిన పీకే ఇప్పుడు ఏకంగా పార్టీ నాయకుడిగా పనిచేయనున్నారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయ‌న‌ సమావేశమ‌వ్వ‌డం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పార్టీ ముఖ్యనేతలతో అధినేత్రి సోనియా గాంధీ జరిపిన కీలక భేటీలో పీకే పాల్గొన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్ల తరువాత సార్వత్రిక ఎన్నికల్లో పటిష్టమైన వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చితన్ శిబిర్ లేదా చింతన్ భైఠక్ పై చర్చించారు.

అయితే.ఈ సమావేశంలోనే పీకే చేరికపైన కూడా సోనియా గాంధీ పార్టీ నేతలతో మాట్లాడినట్టు సమాచారం.

Telugu Bjp, Congress, Gujarat, Kc Venugopal, Strategist, Prasanth Kishor, Punjab

తన రాజకీయ భవిష్యత్తుపై మే 2వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ తెలిపారు.ఈ నేప‌థ్యంలో ప్రశాంత్ కిషోర్.నేడు కాంగ్రెస్ నేతల కీలక భేటీలో పాల్గొని చర్చించడం దేశ రాజ‌కీయాల్లో ఆస‌క్తి నెల‌కొంది.ఈ సమావేశంలో పార్టీ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు.

అయితే.పీకేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై వీరంతా ముందుగానే చర్చించుకున్న‌ట్టు స‌మాచారం.ఈనేప‌థ్యంలోనే పార్టీ ముఖ్య‌నేతల‌ సమావేశానికి వచ్చిన పీకే.రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై తన అభిప్రాయాలను వివరించినట్లు తెలుస్తొంది.

Telugu Bjp, Congress, Gujarat, Kc Venugopal, Strategist, Prasanth Kishor, Punjab

ఇదిలా ఉంటే.2020లోనే కాంగ్రెస్‌లో చేరాలని ప్రశాంత్ కిషోర్ ముందస్తుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ.అనేక విషయాలపై విభేదాల కారణంగా కుదరలేదు.ఇక.మార్చిలో ప్రశాంత్ కిషోర్.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారని గతంలో ప్రచారం సాగింది.

అయితే.ఆ భేటీపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్ప‌టికీ.

పీకే మళ్లీ పార్టీలో చేరుతున్నారనే సందడి మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది.

గతంలోనూ పీకే 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు.ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాలకు గానూ.77 స్థానాలను గెలుచుకుంది.ఇక.2014 లోక్‌సభ ఎన్నికల్లో పీకే వ్యూహ‌ర‌చ‌న‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది.దీంతో కిశోర్ కు మంచి గుర్తింపు లభించింది.రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో పీకే ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమైయ్యారని ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube