ఈవీఎంల పనితీరుపై నేతల అసంతృప్తి  

పోలింగ్ లో ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు. .

Political Party Leaders Unsatisfied On Evm\'s Working In Voting-political Party Leaders,tdp,trs,unsatisfied On Evm\\'s Working,voting,ysrcp

తాజాగా ఏపీలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. తెలుగు రాష్ట్రాలలో, పలు చోట్ల ఎన్నికలలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవాడానికి, పోలింగ్ కేంద్రాల వైపు బారులు తీరారు. అయితే ఈ ఎన్నికలలో ఓటింగ్ యంత్రాల పనితీరుపై పలు చోట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

ఈవీఎంల పనితీరుపై నేతల అసంతృప్తి-Political Party Leaders Unsatisfied On EVM's Working In Voting

ఏపీలో సుమారు 30 శాతం ఓటింగ్ మిషన్ లు పని చెయాడం లేదని, కొన్ని చోట్ల ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి పడుతున్నాయాని ఫిర్యాదులు వచ్చాయని చంద్రబాబు ఎన్నికల అధికారికి లేఖ రాసారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఓటింగ్ మిషన్ ల మొరాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసారు.

మరో వైపు తెలంగాణలో నిజామాబాద్ లో తన ఓటు వినియోగించుకున్న ఎంపీ కవిత ఈవీఎంలు ఎన్నికల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈవీఎంల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు.

మరో వైపు ప్రజలు కూడా చాలా చోట్ల ఈవీఎం ల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం చాలా చోట విమర్శలు వస్తున్నాయని తెలుస్తుంది.