ఫాస్ట్ ఫుడ్‌ పాలిటిక్స్

ఫాస్ట్ ఫుడ్‌ అంటే అందరికీ తెలుసు.అప్పటికప్పడు వండుకొని తినేది.

 Political Parties Started Fast Food Culture-TeluguStop.com

దాని రుచి తెలుసుకోవడానికి గంటల తరబడి ఎదురుచూడనక్కర్లేదు.నోట్లో నీరూరించుకుంటూ వెయిట్‌ చేయనక్కర్లేదు.

వేగం పెరిగిన జీవితాల్లో మనుషులు తిండి కోసం గంటల తరబడి సమయం వెచ్చించాలనుకోవడంలేదు.అందుకే ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్లకు అంత డిమాండ్‌.

చక్కగా పీట మీద కూర్చొని విస్తరేసుకొని లేదా కంచం పెట్టుకొని ఎవరో వడ్డిస్తుంటే తినాల్సిన అవసరంలేదు.ఎంచక్కా మనమే ప్లేట్లలో పెట్టుకొని ఎక్కడబడితే అక్కడ నిలబడి తినేయవచ్చు.

ఇంత ఉపాధ్ఘాతం ఎందుకంటే ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) తిరుగుబాటు నేత (తిరుగుబాటు చేశాక పార్టీ నుంచి బహిష్కరించారు) యోగేంద్ర యాదవ్‌ ఇప్పటి రాజకీయాలను ఫాస్‌్ట ఫుడ్‌ అని అభివర్ణించారు.రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వెయిట్‌ చేయడంలేదని అన్నారు.

ఇరవై రోజుల్లోనో, ఇరవై నెలల్లోలోనో మార్పు రావాలని కోరుకుంటున్నారని, ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు.ఆమాద్మీ పార్టీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

దేశానికి మంచి జరుగుతుందంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని కూడా చెప్పారు.ఏదైనా పార్టీని అధికారంలోకి తెచ్చాక ప్రజలు కూడా ఫలితాల కోసం వెంటనే ఎదురుచూస్తున్నారు.

ఇదీ ఫాస్ట్ ఫుడ్‌ సంస్కృతే కదా…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube