ఎవరి స్వార్ధం వారిది ! రాజకీయాల్లో ఇంతే.. రాజకీయాల్లో ఇంతే

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నేటి రాజకీయ నాయకులకు కామన్ అయిపొయింది.గతంలో లా ఏ పదవి రాకపోయినా పార్టీ కోసం కష్టపడే నాయకులు పెద్దగా కనిపించడంలేదు.

 Political Parties Selfishness In Andhra Pradesh-TeluguStop.com

ఇప్పుడున్న నాయకులకు కావాల్సింది పార్టీలో చేరి చేరగానే ఏదో ఒక పదవి కావలి.ఆ పదవి దక్కితేనే వారికి గౌరవం లేకపోతే.

వారు ఏ మాత్రం వెనుకాముందు ఆలోచించకుండా పార్టీ మారిపోతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది.

నేటి రాజకీయం మాత్రం ఒక పార్టీలో చేరడం.చేరడమే సీటు కోసమే జరుగుతుంది.

అది ఒక్క ఎమ్యెల్యే ఎంపీలకు మాత్రమే పరిమితం కావడం లేదు.వార్డ్ సభ్యుడు, సర్పంచ్, జెడ్పి టిసి, ఎంపిటిసి కార్పొరేటర్ స్థాయి నుంచి పై వరకు ఇదే ధోరణి నడుస్తుంది.

ఏ నాయకుడు ఏ పార్టీలో ఎంతకాలం ఉంటాడో మినిమమ్ గ్యారంటీ లేకుండా పోయింది.అలాగే పార్టీలు కూడా అకస్మాత్తుగా నాయకుల పదవి, సీటు మార్చేస్తున్నాయి.ఇక్కడ ఒకటే కనిపిస్తోంది పార్టీకి గెలుపు కావాలి.నాయకుడికి పదవి కావలి.ఈ సూత్రం ఆధారంగా నేటి రాజకీయాలు నడుస్తున్నాయి.

ఏపీ విషయానికి వస్తే… సిట్టింగ్ ఎమ్యెల్యేలు బలంగా ఉన్నారంటే.

అధికారపక్షానికి చెందినవారు విపక్షంలోకి వెళ్ళి తమ సీటు తేల్చమంటున్నారు.అక్కడ సీన్ లేదని అర్ధమైతే ఆ పార్టీలో ఒక్క క్షణం వృధా చేయకుండా జనసేన వంటి పార్టీలోకి జంప్ అయిపోతున్నారు.

ఈ పరిణామాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నా.సీటు ఇవ్వనప్పుడు ఆ నాయకులు ఎలా వుంటారనే చర్చను బెర్త్ దక్కని నేత క్యాడర్ బలంగా ప్రచారం సాగిస్తున్నారు.

అదే ఇప్పుడు అన్ని పార్టీలకు తలపోటు వ్యవహారంగా మారింది.

ముందస్తు ఎన్నికలకు టిడిపి ఏపీలో సిద్ధపడకపోయినా ముందే టికెట్ల ఖరారుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారు.వాస్తవానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు బి ఫారం దక్కే వరకు ఎవరికి సీటు దక్కుతుందో అనే ఉత్కంఠ బాబు కొనసాగించేవారు.కానీ ప్రస్తుతం దీనికి భిన్నంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు సమయం ఉండటం మంచిదన్న ధోరణిలో చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు అప్పుడే అభ్యర్థులను ప్రకటించేస్తున్నాడు.

ఇది మారిన రాజకీయ పరిస్థితులకు అర్ధంపడుతోంది.ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టికెట్లు ఖరారు చేసిన నేపథ్యంలో టిడిపికి సైతం మరో ఆప్షన్ లేని పరిస్థితి ఎదురైంది.

ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube