ఎన్నికల ముందు ఒక్క రోజే అంతా జరిగిపోతుందా  

ప్రలోభాల పర్వం మొదలెట్టిన రాజకీయ పార్టీలు.

Political Parties Concentrate On Money Politics-

ఏపీ రాజకీయాలలో నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది.రాజకీయ పార్టీలు అన్ని ఇంటికి పరిమితం అయిపోయాయి.అయితే ఏపీ రాజకీయాలలో ఇన్ని రోజులు జరిగిన ప్రచారం అంతా ఒక ఎత్తైతే.ఈ ఒక్క రోజు జరిగేది మరో ఎత్తుగా ఉంటుంది.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రాలో ఎక్కువగా రాజకీయ పార్టీలు ప్రజలని ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటాయి.

Political Parties Concentrate On Money Politics--Political Parties Concentrate On Money Politics-

ఇక ఇన్ని రోజులు దాచిన డబ్బుని బయటకి తీసి, కార్యకర్తల ద్వారా ప్రజలకి చేరవేసే ప్రయత్నం మొదలెడతాయి.ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీసాయి.ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావాలని వైసీపీ భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తుంది.

ఇక తమకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఓడించే ప్రయత్నం గట్టిగ చేస్తుంది.మరో వైపు టీడీపీ కూడా అధికారంలో ఉండి సంపాదించిన సొమ్ముని ఎన్నికలలో ప్రజలని ప్రలోభాలకి గురి చేయడానికి ఉపయోగిస్తుంది.

దీంతో అన్ని చోట్ల డబ్బులు ఏరులై పారుతుంది.మరోవైపు ఎన్నికల సంఘం ఇలాంటి ప్రలోభాలకి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తున్న అందులో ఎంత వరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు అనేది అర్ధం కాని విషయం.