ఇక కార్పొరేషన్ రాజకీయం షురూ..అస్త్రాలు సిద్ధం చేస్తున్న పార్టీలు

తెలంగాణలో వరుస పెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఇలా ఒకదాని తరువాత మరొక్కటి ఎన్నికలు జరగాయి.

 Political Parties Ready For Corporation Elections, Corporation Elections, Politi-TeluguStop.com

ఇప్పుడు త్వరలో మరో ఎన్నికల సమరం మొదలు కానుంది.అవే కార్పొరేషన్ ఎన్నికలు.

ఖమ్మం, వరంగల్, జడ్చర్ల, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి.ఇక ఈ పుర సమరానికి ఇక అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

ఇక ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ఏయే పార్టీల బలం ఎంత ఉంది అనేదానికి నిదర్శనంగా చూడవచ్చు.ఇక నాగార్జున సాగర్ లో గెలిచిన పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో కొంచెం మైలేజీ దొరికే అవకాశం ఉంది.

ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలో చాలా మంది ఓటర్లు ఇచ్చిన మద్దతు మీద కార్పొరేషన్ లో వేసే కొద్ది మంది ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది.అది కాదనలేని వాస్తవం.

ఇప్పటికే బీజేపీ క్షేత్ర స్థాయిలో తమ కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేస్తోంది.ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు కార్యాచరణ మొదలుపెట్టనప్పటికీ త్వరలో కార్యాచరణ మొదలుపెట్టె అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube