ఏపీ పాలిటిక్స్ : వారసుల హవా మాములుగా లేదుగా

ఏపీ పాలిటిక్స్ లో రాజకీయ వారసుల హవా ఓ రేంజ్ లో ఉంది.తమ తరువాత తమ వారసులే రాజకీయ చక్రం తిప్పాలనే ఉద్దేశంతో వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్లు భావిస్తూ వీలైతే తమతో పాటు తమ వారసులు కూడా టిక్కెట్లు సాధించాలని గట్టిగా ప్రయత్నం చేశారు.

అందులో కొంతమంది సక్సెస్ అవ్వగా మరికొంతమంది వెనుకబడ్డారు.తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే వారసుల హవా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

కొంతమంది సీనియర్ నాయకులు అనేక కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.కానీ ఆ సీటు వేరే వారికి కట్టబెట్టడం ఎందుకని వారి వారసులనే రంగంలోకి దించారు.

టిడిపి ప్రకటించిన లిస్టులో వారసుల జాబితా పెద్దగానే కనిపిస్తోంది.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ ఒకరో ఇద్దరో వారసులు తెరపైకి వచ్చారు.

శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందిన గౌతు శ్యామసుందర శివాజీ తమ వారసురాలిగా కుమార్తె గౌతు శిరీష రంగంలోకి దించారు.కర్నూలు జిల్లాకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కుమారుడు డోన్ నియోజకవర్గం నుంచి, అలాగే చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి కుమారుడు నాగార్జున తెరపైకి వచ్చారు.

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీకి దిగుతున్నారు.చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అకాల మరణంతో ఆయన కుమారుడు భాను ప్రకాష్ నగర్ టిడిపి కేటాయించింది.

గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రు కుమారుడు దేవినేని అవినాష్ కొడాలి నాని పై పోటీకి దిగుతున్నారు.ఈ సీటును వైసిపి టిడిపి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె అదితి పోటీకి దిగుతున్నారు.అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మరోసారి పోటీకి దిగుతుండగా ఎర్రన్నాయుడు కుమార్తె భవాని రాజమండ్రి అర్బన్ నుంచి పోటీకి దిగుతున్నారు.విజయవాడ నుంచి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా పోటీకి రెడీ అయ్యారు.అనంతపురం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు పడ్డ జెసి బ్రదర్స్ ఇద్దరు కూడా తమ కుమారులను రంగంలోకి దింపారు.

జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు హస్మత్ రెడ్డి అసెంబ్లీ సీటు దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ లోక్ సభ సీటు దక్కించుకున్నారు.ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మంత్రిగా పనిచేసినా తొలిసారిగా మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు.

ఇంకా అనేకమంది రాజకీయ వారసులు తమ అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకోబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube