ఏపీలో సంజయ్ హడావుడి ఏంటి ? వీర్రాజు పై నమ్మకం లేదా ?

ఏపీలో బీజేపీ నాయకులు అంతా అదే పనిగా టీడీపీ, వైసీపీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.గతం కంటే ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకుల్లో స్పీడ్ బాగా పెరిగింది.

 Political Discution About Bandi Sanjay Entry In Ap Politics-TeluguStop.com

హిందూ దేవాలయాలలో చోటు చేసుకుంటున్న అనేక సంఘటనలు ఏపీ బిజెపి నాయకులకు బాగా కలిసి వస్తున్నాయి.గత టీడీపీ ప్రభుత్వం , ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని కలిపి విమర్శిస్తూ అదేపనిగా విమర్శలు చేస్తున్నారు.

అయితే ఆ విమర్శలు టీడీపీ విషయంలో ఘాటుగా ఉంటున్నా, వైసీపీ విషయంలో మాత్రం సుతిమెత్తగా ఉంటున్నాయని, వైసీపీకి అంత గట్టిగా తగలడం లేదని, దీనికి కారణం ఏపీ బీజేపీ లో ప్రస్తుతం కీలకంగా ఉన్న నాయకులు చాలామంది వైసిపికి అనుకూలంగా ఉండడమే కారణం అనే వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి.

 Political Discution About Bandi Sanjay Entry In Ap Politics-ఏపీలో సంజయ్ హడావుడి ఏంటి వీర్రాజు పై నమ్మకం లేదా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ బిజెపి నేతలు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం, ఇప్పుడు చోటుచేసుకుంటున్న సంఘటనలపై స్పందిస్తూ,  జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ రావడం చర్చనీయాంశంగా మారాయి.

కొద్దిరోజుల క్రితమే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ రాజకీయాలపై స్పందించారు.ముఖ్యంగా శ్రీశైలంలో చోటుచేసుకుంటున్న పరిణామాల పై స్పందించడం వంటివి కలకలం రేపాయి.తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా, బైబిల్ రాజకీయం కావాలా.? భగవద్గీత రాజకీయం కావాలా అంటూ మతపరమైన విమర్శలు చేశారు.త్వరలోనే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ను తరిమి కొడతామంటూ ఘాటు వ్యాఖ్యలే చేసారు.తెలంగాణ బిజెపి నాయకులు చేస్తున్నంత ఘాటు గా ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేయలేకపోవడం , త్వరలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఏపీ నేతల స్పీడ్ సరిపోదు అనే అభిప్రాయంతో ఇప్పుడు సంజయ్ ను రంగంలోకి దించినట్టు గా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోం

Telugu Amithsha, Ap, Ap Bjp President, Bandi Sanjay, Bjp, Goshamahal Mla, Modhi, Rajasing, Somu Veeraju, Tdp, Telangana, Telangana Bjp President, Tirupati Elections, Ysrcp-Telugu Political News

సోము వీర్రాజు అనుకున్నంత స్థాయిలో దూకుడు ప్రదర్శించలేకపోవడంతోనే, ఇప్పుడు సంజయ్ ఎంట్రీ ఇస్తున్నారనే చర్చ మొదలైంది.బండి సంజయ్ ఏపీలో పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.తిరుపతి బీజేపీ ఖాతాలో పడితే సంజయ్ తో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేయించాలనే ఆలోచనలో కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఈ వ్యవహారాలన్నీ సోము వీర్రాజు శక్తి సామర్ధ్యాలపై అందరిలోనూ అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయనేది బీజేపీలోనే కొందరు నాయకుల అభిప్రాయంగా కనపిస్తోంది.

#Somu Veeraju #Amithsha #Goshamahal Mla #Ysrcp #TelanganaBjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు