మీరు ఓటు ఎవరికి వేసారు! బెట్టింగ్ ముఠాల నయా ప్లాన్!  

ఏపీలో జోరుగా పొలిటికల్ బెట్టింగ్స్. .

Political Bettings In Andhra Pradesh-janasena,political Battings,tdp,ysrcp

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయిన. ఇంకా ప్రజలపై రాజకీయ నాయకులు పెత్తనం మాత్రం పోలేదు. మరోవైపు రాజకీయాలలో నేతలపై బెట్టింగ్ లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి..

మీరు ఓటు ఎవరికి వేసారు! బెట్టింగ్ ముఠాల నయా ప్లాన్!-Political Bettings In Andhra Pradesh

ముఖ్యంగా ప్రధాన నాయకులు, కచ్చితంగా గెలుస్తారని అనుకున్న వారిపైనా, అంచనాలకి అందని నేతల మీద బెట్టింగ్ ముఠాలు జోరుగా బెట్టింగ్ లకి తెరతీసాయి. ఒకటికి పది అంటూ ఆశ పెడుతున్నాయి. అలాగే అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు ఈ బెట్టింగ్ లలో జోరుగా పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ పొలిటికల్ బెట్టింగ్ ల కోసం బెట్టింగ్ ముఠాలు ప్రజలకి ఫోన్ చేసి పోస్ట్ పోల్ సర్వ్ అని చెబుతూ మీరు ఎవరికి ఓటు వేసారు అని అడుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రజల నుంచి వచ్చే సమాచారం బట్టి నేతలపైన బెట్టింగ్ లని షురూ చేస్తున్నట్లు తెలుస్తుంది. బెట్టింగ్ ముఠాల ఫోన్ కాల్స్ ఎక్కువగా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి, అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పలానా చోట ఓడిపోతాడు అంటూ బెట్టింగ్ లు ఎక్కువగా నడుపుతున్నారని టాక్ వినిపిస్తుంది.