ఎన్నికలలో గెలుపుపై మొదలైన బెట్టింగ్ లు  

ఏపీలో ఎలక్షన్స్ పై భారీగా జరుగుతున్న బెట్టింగ్ లు.

Political Betting In Andhra Pradesh-political Betting,tdp,ysrcp

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంకం ముగిసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 77 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఏపీ చరిత్రలో మొదటిసారి అని తెలుస్తుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పడం వలనే సాధ్యం అయ్యింది అని ప్రతిపక్షాలు అంటున్నాయి..

ఎన్నికలలో గెలుపుపై మొదలైన బెట్టింగ్ లు-Political Betting In Andhra Pradesh

కాదు అధికార పార్టీ సంక్షేమంకి పడిన ఓటింగ్ అదంతా అని అధికార పార్టీ చెప్పుకుంటుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు పోలింగ్ అనంతరం రెండు పార్టీల వైపు అభ్యర్ధులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్ధుల గెలుపుపై ఏపీలో బెట్టింగ్ లు మొదలయ్యాయి.

అధికార పార్టీ అభ్యర్ధి గెలుస్తాడని ఇంత, కాదు ప్రతిపక్ష పార్టీ అభ్జ్యర్ధి గెలుస్తాడని ఇంత అని లక్షల నుంచి కోట్ల రూపాయిల పందేలు కాసేందుకు చాలా మంది సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక గుడివాడలో అధికార పార్టీ అభ్యర్ధి దేవినేని అవినాష్ ఓడిపోతే కోటికి పదికోట్లు అంటూ బెట్టింగ్ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.