ఏపీలో రాజ‌కీయ ర‌గ‌డ‌.. ప్ర‌జ‌లు ఎవ‌రిని స‌మ‌ర్ధిస్తున్నారు..?

ఏపీలో రాజ‌కీయాలు రోడ్డెక్కాయి.ఏపీలో జ‌రుగుతున్న పాలిటిక్స్ దేశంలోని ఏ రాష్ట్రంలో క‌నిపించ‌వు అంటే సందేహం లేదు.

 Political Arena In Ap .. Who Are The People Supporting . Ap Politics, Ycp, Tdp,-TeluguStop.com

నాయ‌కులు త‌మ ప‌రువు తామే తీస‌కుంటున్నారు.అధికారంలో ఉన్న వైసీపీ నేత‌లు బాధ్య‌త మ‌రిస్తే.

ప్ర‌తి ప‌క్షం కూడా త‌మేమీ త‌క్కువ లేమ్ అంటూ హ‌ద్దులు దాటుతున్నారు.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై విప‌క్ష నేత ఘ‌టూగా విమ‌ర్శిస్తే జ‌నాల‌లో రియాక్ష‌న్ అంత‌గా క‌నిపించ‌లేదు.

సుదీర్ఘ అనుభ‌వం ఉన్న ఏ ప్ర‌తి ప‌క్ష నాయకుడి పార్టీ కార్యాల‌యంపై దాడి జ‌రిగితే అక్క‌డి జ‌నాల‌లో సానుభూతి వ‌చ్చిందా అంటే సందేహ‌మే.అస‌లే ఏపీలో రాజ‌కీయాల‌లో ఏం జ‌రుగుతోంది.

నేత‌లు చేస్తున్న త‌ప్పుల‌ను జ‌నాల‌లు గ‌మ‌నిస్తున్న‌రా? .ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం దాడుల‌కు దిగితే జ‌నాల‌లో రిజ‌ల్ట్ ఇలానే ఉంటుంది.ప్ర‌జ‌లు ఎప్పుడు త‌మ గురించే ఆలోచిస్తేనే స్పందిస్తార‌ని.త‌మ‌కు సంబంధం లేని విష‌యాల‌ను దూరంగా పెడుతార‌ని విశ్లేష‌కుల అంచ‌న‌.

Telugu Central, Chandra Babu, Lokesh, Pattabhi, Status, Tamilanadu, Telengana, Y

ప‌క్క‌న ఉన్న త‌మిళ‌నాడులో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాలల్సిన ప్రాజెక్టులు, నిధుల విష‌యంలో అక్క‌డి అధికారం ప‌క్షం, విప‌క్షం ఏక‌మౌతోంది.రాష్ట్ర సంక్షేమం కోసం పోరాడుతారు.దేశం బాగుండాల‌ని అక్క‌డి పార్టీలు భావిస్తాయి.అంతేకాకుండా తెలంగాణంలో కూడా కొంత రాజ‌కీయ ఐక్య‌త ఉంది.క్రిష్ణ జ‌లాల విష‌యంలో అక్క‌డి పార్టీల నాయ‌కులు క‌లిసి ముందుకొచ్చారు.కానీ ఏపీలో మాత్రం త‌లో మాట.ఇలా చేస్తే జ‌నాల‌కు ఏం ప్ర‌యోజ‌నం అనే వాద‌న వినిపిస్తుంది.ఇలాంటి రాజ‌కీయ నాయ‌కుల గురించి ప్ర‌జ‌లు ఎందుకు ఆలోచిస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అధికారంలో ఉన్న వారికి విప‌క్షంలో ఉన్న వారు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తే రాష్ట్రం ప్ర‌గ‌తి సాధిస్తుంద‌ని చెబుతున్నారు.

అధికారంలో ఉన్న వారు ఏ ప‌నిలోనైనా విప‌క్షం విశ్వాసం తీసుకోవాల‌ని ఆలోచించ‌డం లేదు.

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అంతగా బాగా లేదు.విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌లేదు కేంద్రం.

ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌త్యేక హోదా సాధించాలేదు.రోజురోజుకు అప్పులు పెరిగిపోతున్నాయి.

ఇన్ని స‌మ‌స్య‌లు ఉన్నా వాటిపై దృష్టి పెట్ట‌కుండా అధికారంలో ఉన్న వారు.విప‌క్షంలో ఉన్న వారు స‌హ‌క‌రించ‌కుండా దాడుల‌కు దిగ‌డంతో జానాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube