ఫుడ్ ఇవ్వగానే ఆ మాట చెప్పేస్తున్నా బుడ్డోడు.. నెటిజన్లు ఫిదా!

సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు పెద్ద వారిని చూసి ఎన్నో పనులు నేర్చుకుంటారు.వారు చేసే ఎటువంటి పనులు అయినా ఆ ప్రభావం తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి వారిపై పడుతుంది.

 Thank You Mama This Toddlers Super Polite Behaviour Is The Best Thing  Polite Be-TeluguStop.com

పిల్లలకి చిన్నతనం నుంచి కొన్ని నైతిక విలువలు నేర్పించడం వల్ల వారికి భవిష్యత్తులో ఎంతో ముందుకు రాణిస్తారు.పిల్లల ప్రవర్తన, మాట తీరు, వారి నడవడిక ఇవన్నీ కేవలం వారి కుటుంబ సభ్యుల పైన ఆధారపడి ఉంటాయి.

పిల్లలకు చిన్న తనం నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో అన్న ఈ విషయాలను గురించి చిన్నతనం నుంచి అలవాటు చేయడం వల్ల వారి జీవితంలో ఎంతో మంచి నడవడికతో మసలు కుంటారు.ఈ తరహాలోనే ప్రస్తుతం నెట్టింట్లో ఓ చిన్నోడు వ్యవహరించిన తీరు అందరి హృదయాలను కొల్లగొట్టింది.

ప్రస్తుతం ఈ బుడ్డోడి వీడియో వైరల్ గా మారింది.

గ్రే అనే బాలుడు తన తల్లికి ఎంతో మర్యాదపూర్వకంగా, ముద్దుముద్దుగా కృతజ్ఞతలు తెలుపుతన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది.

ఈ వీడియోలో ఆ బాలుడు తనకు కావాల్సిన ఏదైనా ఆహార పదార్థాలు గాని, ఆట బొమ్మల కానీ, ఇతర వస్తువులు ఏవైనా అడిగినప్పుడు తన తల్లి ఇవ్వడంతో, అందుకు కృతజ్ఞతగా ఎంతో ముద్దుగా”థాంక్యూ మామ్”అని ముద్దుగా ప్రతిస్పందించడం తో ఈ వీడియో అందరిని ఆకర్షించింది.

ప్రస్తుతం ఇన్‌స్టాలో వైరల్ గా మారిన ఈ వీడియో అతికొద్ది సమయంలోనే ఎంతోమంది చూపరులను ఆకట్టుకుంది.

ఈ వీడియో చూసిన సదరు నెటిజన్లు ఇంత చిన్న వయసులోనే ఇంతటి మంచి లక్షణాలు అలవడటం, ఎంతో గొప్ప విషయం అంటూ గ్రే ను ప్రశంసించారు.ఇలాంటి తరహా వీడియోలు రావడం వల్ల, ఎంతో మంది పిల్లలకు ప్రేరణగా ఉంటుందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube