కరోనా మహమ్మారికి పోలియో వ్యాక్సిన్ తో అడ్డుకట్ట... పరిశోధనలు విస్తృతం

ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం అన్ని దేశాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.కరోనా వైరస్ ని ఎదుర్కొనే వాక్సిన్ తయారు చేయడం కోసం విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు.

 Polio Vaccine Could Protect Against Covid-19, Corona Virus, Corona Effect, Lock-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు ఎ దేశం కూడా సమర్దవంతంగా కరోనాని ఎదుర్కొనే మందుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రాలేకపోయారు.ఇతర వ్యాధుల కోసం ఉన్న మెడిసన్, అలాగే రోగనిరోధక శక్తి పెంచే మందులని ఉపయోగించి వైరస్ కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

అయితే ఇతర రోగాల కోసం ఉపయోగించే మెడిసన్ ని కరోనా కోసం ఉపయోగించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.ఇప్పటి వరకు యాంటీ మలేరియా మందులని కరోనా చికిత్సకి ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ తో కరోనాకి అడ్డుకట్ట వేయవచ్చేమో అనే విషయం మీద పరిశోధనలు మొదలు పెట్టారు.ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.

కరోనా వైరస్‌పై పోరాడేందుకు బాసిల్లస్ కాల్మెట్టే గ్యురిన్ టీకా చక్కగా పనిచేస్తుందని టెక్సాస్ ఏ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో పేర్కొన్నారు.గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు ఉన్నట్టు చెప్పారు.

కరోనాపై పోరుకు పోలియో టీకాను ఉపయోగించొచ్చని మరికొందరు చెబుతున్నారు.బీసీజీ, పోలియో టీకాల వల్ల బాధితులకు ముప్పు తక్కువని, ఇప్పటికే వీటిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇచ్చారని పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా పేర్కొన్నారు.

ఈ టీకాల వల్ల సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఫలితంగా కరోనా వైరస్ ని ఎదుర్కొనే శక్తి రోగికి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఈ నేపధ్యలో పోలియో వాక్సిన్ పై మరింత విస్తృతంగా పరిశోధనలు చేసి కరోనాని ఎంత వరకు ఈ వాక్సిన్ నియంత్రిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube