పిల్లలకు నిరభ్యంతరంగా పోలియో డ్రాప్స్ వేయించండి... పోలియో చుక్కలు వేయించొద్దంటూ వైరలవుతున్న మెసేజ్ నమ్మొద్దు...  

Polio Vaccine Absolutely Safe.. Don\'t Believe Rumours-

“రేపు 5 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి పోలియో ఇవ్వొద్దు.దాంట్లొ వైరస్ కలిసిందంటా.పోలియోని తయారు చేసిన ఆ కంపెని యజమానిని అరెస్ట్ చేసారు.దయచేసి అందరికి చెప్పగలరు..

Polio Vaccine Absolutely Safe.. Don\'t Believe Rumours--Polio Vaccine Absolutely Safe.. Don't Believe Rumours-

”ఇది వాట్సప్లో,ఫేస్బుక్లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్.దీంతో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలా వద్దా అనే డైలమాలో తల్లిదండ్రులున్నారు…అయితే కంపెని యజమానిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం కానీ పోలియో చుక్కలు వేయించొద్దు,హనికరం అనే వార్తలు నమ్మొద్దు.పోలియో సురక్షితం అంటూ కేంద్రం ప్రకటణ కూడా చేసింది…అసలింతకీ ఏం జరిగింది…తెలుసుకోండి.

మన దేశంలో 4 ఫార్మాసూటికల్ కంపెనీలు మాత్రమే పోలియో వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి.అందులో ఘజియాబాద్ లోని బయోమెడ్ కంపెనీ తయారుచేసిన కొన్ని పోలియో నోటి చుక్కల బాటిళ్లలో టైప్-2 పోలియో వైరస్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపిన ఈ బాటిళ్లలో మందు కలుషితం అయినట్టు గుర్తించారు.వెంటనే ఆ వ్యాక్సిన్లను వెనక్కి రప్పించింది.

వెంటనే స్పందించిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీకి నోటీసులు ఇచ్చింది.యజమానిని అరెస్టు చేయించింది….కలుషితమైన పోలియో చుక్కలు పిల్లలకు వేయించామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది.ఒక వేళ కలుషితమైన వ్యాక్సిన్ వేసినా… ప్రాణాపాయం ఉండదని… భారతీయ పిల్లల్లో దానిని ఎదుర్కొనేంత రోగ నిరోధక శక్తి ఉంటుందని తెలిపింది..

ఇంతకీ టైప్ 2 వైరస్ అంటే ఏంటి??

వాక్సిన్ ఒక డియాక్టివేటెడ్ పోలియో వైరస్.వాక్సిన్ వేసినప్పుడు మన శరీరంలోని శ్వేతకణాలు(తెల్లరక్తకణాలు) ఈ వైరస్ ను ఎలా నిర్వీర్యం చేయాలో తెలుసుకొని తర్వాత నిజమైన వైరస్ మన శరీరంలో ప్రవేశించినప్పుడు అదేవిదంగా ఆ వైరస్ ను నిర్మూలిస్తుంది.అంటే ఓ రకంగా కోరలు పీకిన పామును 10 మంది ఉన్న గదిలో విసిరేసినట్టు.ఆ పామును పట్టుకొన్న అనుభవంతో కోరలున్న పామును ఎలా పట్టుకోవాలో తెలుసుకుంటాయి తెల్లరక్తకణాలు.

పోలియో వాక్సిన్ 3 రకాల పోలియో వైరస్ లు కలిగి ఉంటుంది.పోలియో టైప్ 1, టైప్ 2, టైప్ 3.అందుకే దీన్ని ట్రైవాలెంట్ వాక్సిన్ అంటారు.

క్రమంగా పోలియో టైప్ 2 ప్రపంచం నుండి(మానవ శరీరంలో) పూర్తిగా తొలగించాం.అందుకే WHO బైవాలెంట్ వాక్సిన్ ను రికమెండ్ చేసింది.2016 ఏప్రిల్ నెలలో భారతదేశం, దేశంలో ఉన్న మొత్తం ట్రైవాలెంట్ వాక్సిన్ స్టాక్ ను మార్కెట్ నుండి తొలగించి ధ్వంసం చేసింది.ఇప్పుడు ఉన్న వాక్సిన్ లు టైప్ 1, టైప్ 3 వైరస్ లతో చేసినవి.ఇప్పుడు కలుషితం అంటే ఆ మూడు బ్యాచ్ లలో టైప్ 1, టైప్ 2, టైప్ 3 కలసి వచ్చింది.అంటే మనం 2016కు ముందు వాడిన వాక్సిన్ ఇప్పుడు కలుషితంగా పిలవబడుతోంది.దీని గురించి ఏమాత్రమూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు..

ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం మానకండి….