'పొకిమాన్' ఆడుతూ.. దొంగతనం చూసింది: వెంటాడి కాల్చి చంపిన దుండగులు

దొంగతనం చేస్తుండగా చూసిందని ఓ యువతిని దొంగలు కాల్చి చంపారు.వివరాల్లోకి వెళితే.

 Polimon Womanshotdeadafter Witnessing Armedrobbery-TeluguStop.com

న్యూ మెక్సికోకు చెందిన కేలా కాంపోస్ అనే 21 ఏళ్ల పొకిమాన్ గో ప్లేయర్ గత శుక్రవారం రాత్రి తన ప్రియుడితో కలిసి అల్బుకెర్కీలోని బియాంచెట్టి పార్క్ మీదుగా వెళుతూ పోకిమాన్ గేమ్ ఆడుతోంది.ఈ క్రమంలో వారికి దుండగులు దొంగతనం చేయడం కనిపించింది.

ఈ జంటను గమనించిన దుండగులు కేకలు వేశారు.

దీంతో కంగారుపడిన కాంపోస్ కారును వెనక్కిపోనిచ్చింది.

అయితే దుండగులు కారుపై పలుమార్లు కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ ఆమె మెడ వెనుక భాగంలోంచి దూసుకెళ్లింది.ఆ కాసేపటికే కాంపోస్ ప్రయాణిస్తున్న కారు దగ్గరలోని ఇంటిని ఢీకొట్టింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆమెను న్యూ మెక్సికో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కాంపోస్ మరణించినట్లుగా పోలీసులు తెలిపారు.కాగా.

ఆమె ప్రియుడు ఈ ప్రమాదంలో గాయపడ్డాడా లేక మరణించడా అన్నది తెలియరాలేదు.అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Telugu Cayla Campos, Pokmon, Telugu Nri Ups-Telugu NRI

  కాంపోస్ మరణంతో ఆమె తండ్రి కార్ల్ కాంపోస్ దిగ్భ్రాంతికి గురయ్యారు.తన కూతురు తన మనస్సులోంచి ఎప్పుడు చెరిగిపోదని.ఆమె లేకుండా ఎలా జీవించాలో అర్ధం కావడం లేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు.కాంపోస్ మిత్రుడు కోడి బెల్ మాట్లాడుతూ.ఆమె ఒక అద్భుతమైన వ్యక్తని.తాను ఒక మంచి స్నేహితురాలిని పొగొట్టుకున్నానని వెళ్లాడించాడు.

ప్రతిరోజు కాంపోస్ ఆమె ప్రియుడు ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ చుట్టూ చక్కర్లు కొడుతూ పోకిమాన్ ఆడుతుంటారని తెలిపాడు.కాగా.

ఈ ఘాతుకానికి పాల్పడిన వారు రెడ్ కలర్ ఫోర్డ్ కారులో మరియు ఫోర్ డోర్ సెడాన్ కారులో దొంగతనానికి వచ్చారని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.వీరి ఆచూకీ తెలిస్తే 505-242-2677 నెంబర్‌కు సంప్రదించాలని అల్బుకెర్కీ పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube