పాలసీసాలు అనుకుని తీసుకోని పోయారు...కానీ..?

భూమిలో ఉన్న సీసాలను చూసి అటుగా వెళ్తున్న కొందరు పాలసీసాలు అనుకున్నారు.వాటిని ముట్టుకున్నాకే తెలిసింది అవి నాటు బాంబులని.

 Policies Could Not Be Taken For Granted But-TeluguStop.com

ఈ సంఘటన యూకేలో చోటుచేసుకుంది.యూకే లోని హాంప్‌షైర్‌ లో బ్రామ్‌డియన్‌కు చెందిన జేమ్స్ ఒస్బోర్న్ నివశిస్తున్నాడు.

ఓ రోజు తన ఇంటికి కొంత దూరంలో కొన్ని సీసాలు ఉండటాన్ని గమనించాడు. పాలసీసాల్లా కనిపిస్తున్న వాటిని భూమి నుంచి నేల మీద పెడదామని ప్రయత్నిస్తుండగా వాటి నుంచి పెద్ద ఎత్తున పొగ వచ్చింది.

 Policies Could Not Be Taken For Granted But-పాలసీసాలు అనుకుని తీసుకోని పోయారు…కానీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో భయంతో పరుగులు తీశారు.జరిగిన విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు.సీసాలకు తెల్లటి టాప్ ఉంది.అంతేకాకుండా సీసాలకు చివరన పసుపు ద్రవం ఉండటం వల్ల దాన్ని చూసిన ఒస్బోర్న్, అతని స్నేహితుడు వాటిని పాల సీసాలు అని అనుకున్నారు.ఆ ప్రాంతంలో 48 సీసాలను బయటకు తీశాడు.పోలీసులు వచ్చి వాటిని పరిశీలించి అవి గ్రెనేడ్ లుగా నిర్ధారించారు.

బాంబ్ స్క్వాడ్ వచ్చి వాటిని నిర్వీర్యం చేసింది.

చివరికి పోలీసులు వాటి వివరాలను తెలుసుకున్నారు.

ఆ ప్రాంతంలో నాజీల దాడి నుండి గ్రామాలను రక్షించడానికి 1940 లలో పేలుడు పదార్థాలను దాచి ఉంచినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఒస్బోర్న్ తండ్రి ఆ స్థలాన్ని ఆ సమంలో ఆర్మీ తరహా హోమ్ గ్రౌండ్ సమూహాలకు అప్పగించారు.

అదృష్టవశాత్తూ ఆ గ్రనేడ్ పేలకుండా ఉంది.లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో అని ఆ తరువాత ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గత సంవత్సరంలో కూడా ఆ ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది.డిసెంబర్ లో ఒక ఇంట్లో వంటగది లోపల బాంబు పేలుడు సంభవించింది.

ఆ సమయంలో వంట గదిలో ఉన్న జోడీ క్రూస్, ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె ఇసాబెల్లాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

#Explosion #2nd World War #Social Media #Grenade

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు