ఉన్నతాధికారి తిట్టారని, పోలీస్ అధికారి అందరూ చూస్తుండగా ఏమి చేశాడంటే!

ఒకపక్క దసరా నవరాత్రులు ప్రారంభం కావడం తో విజయవాడ ఇంద్ర కీలాద్రి పై భక్తుల సందడి ఎక్కువైంది.ఈ సమయంలో ఉన్నతాధికారి మందలించారు అంటూ ఒక పోలీసు అధికారి వినూత్నంగా అక్కడ ఆందోళనకు దిగడం కలకలం రేగింది.

 Policeprotest On Durgatemple Tollgate At Vijayawada-TeluguStop.com

తన తప్పు లేకున్నా తనను మందలించారంటూ దుర్గగుడి టోల్ గేట్ వద్ద ఆ పోలీస్ అధికారి అర్థనగ్న ప్రదర్శనకు దిగారు.ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు ఉండటంతో వారిని సదరు పోలీస్ అధికారి అడ్డుకున్నారు.

దీంతో అతడిపై ఉన్నతాధికారులు అంక్షింతలు వేశారు.అయితే తన తప్పు లేకుండా నన్ను ఇలా ఉన్నతాధికారులు తిట్టడం తో మనస్తాపం కు గురైన ఆ పోలీసు అధికారి చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు.

గత రాత్రి 10:30-11 గంటల మధ్య విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.ఒక్కసారిగా పోలీసు అర్ధనగ్న ప్రదర్సన తో అక్కడ కలకలం రేగింది.

ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు.దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Telugu Telugu Ups, Vijayawada-

వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించడం తో ఇలా నిరసనకు దిగారు.అయితే ఈ ఘటన పై ఉన్నతాధికారులు స్పందిస్తూ పోలీస్ అధికారి నిరసనకు దిగలేదని, అతడికి ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube