హైదరాబాదీలకు పోలీసుల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండకుంటే కఠిన చర్యలు తప్పవట.. ?

చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నగ్నసత్యం.

 Police Warn Hyderabadis Police Warning, Hyderabad, People, Covid Cases, Corona-TeluguStop.com

ఎందుకంటే ఈ నిర్లక్ష్యమే గత సంవత్సరం వచ్చిన కరోనా వల్ల లక్షల ప్రాణాలు పోయేలా చేసింది.ఈ నిర్లక్ష్యమే మనుషులను నష్టాల రూపంలో, ప్రమాదాల రూపంలో వెంటాడుతుంది.

చివరికి పోలీసుల చేత వార్నింగ్ తీసుకునే వరకు వెళ్లింది.

ఇక అసలు విషయం ఏంటంటే.

నగరంలో రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే.కానీ ఈ విషయాన్ని హైదరాబాద్ వాసులు సీరియస్ గా తీసుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రజలు ఇలాగే ఉంటే, కఠిన చర్యలు తీసుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

Telugu Corona, Covid, Hyderabad-Latest News - Telugu

తాజాగా మీడియాతో మాట్లాడిన పోలీసు కమిషనర్, సుమారు కోటి మందికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులను ఎవరూ లెక్క చేయడం లేదని, ఇంతలా నిర్లక్ష్యం తగదని వెల్లడించాడు.కాగా స్వీయ రక్షణ, తమ కుటుంబీకుల రక్షణ మరిచిన ప్రజలు, మాస్క్ లు లేకుండా తిరుగుతున్నారని, ఇలా తిరిగితే కేసులు నమోదు చేయక తప్పదని హెచ్చరించారు.

కాబట్టి కరోనా పై చేసే నిరంతర పోరాటంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను ఆచరిస్తూ రానున్న పండగల సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, కరోనా బారిన పడకుండా ఉండాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube