రాజధానిలో ప్రేమజంటపై దాడి! ప్రియుడు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!  

ఏపీ రాజధాని అమరావతిలో ప్రేమ జంటపై దుండగుల దాడి కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు, ప్రియుడు హత్య చేసి ఉంటాడనే కోణంలో విచారణ.

ఏపీ రాజధాని అమరావతిలో ప్రేమజంటపై దుండగులు దాడి చేసి ప్రియురాలు జ్యోతిని అత్యాచారం చేసి, హత్యా చేసి ప్రియుడు శ్రీనివాసరావుని గాయపరిచి వదిలేసినా ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మంగళగిరి కి చెందిన శ్రీనివాసరావు, జ్యోతి ఒకే గ్రామానికి చెందిన వారు కావడం, అలాగే పక్క పక్క ఇళ్ళల్లో ఉంటూ ప్రేమించుకోవడం జరిగింది. అయితే తాజాగా అర్ధరాత్రి వీళ్ళిద్దరూ అమరావతి, నవులూరు వైపు వెళ్తున్న టైంలో కొంత మంది దుండగులు దాడి చేసి జ్యోతిని చంపేశారు అనే వాదన వినిపిస్తూ వుండగా, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పోలీసులకి చాలా అనుమానాలు కలిగించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

జ్యోతి ప్రేమికుడు శ్రీనివాసరావు మీద గతంలో చాలా ప్రాంతాలలో క్రిమినల్ కేసులు నమోదు అయ్యి వుండటం కారణంగా, జ్యోతి హత్యలో అతని ప్రమేయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే దుండగులు శ్రీనివాసరావుని స్వల్పంగా గాయపరిచి వదిలేసి జ్యోతిని హత్య చేయడం వెనుక కారణాలు కూడా అనుమానంగా వుండటంతో పోలీసులు దాని వెనుక మొత్తం కథని బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జ్యోతి కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాసరావు మీదనే అనుమానం వ్యక్తం చేయడంతో ఇదంతా పథకం ప్రకారం శ్రీనివాసరావు చేసాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంత ఎవరో దుండగులు దాడి చేసినట్లు భావించిన పోలీసులు జ్యోతి హత్యాలో మిస్టరీ విషయాలని ఒక్కొక్కటిగా బయటకి తీసే పనిలో పడ్డారు. ఇది ప్రియుడు చేసిందా, లేక పరువు హత్య అనేది త్వరలో పూర్తిగా పోలీసులు తెలుసుకునే అవకాశాలు వున్నట్లు తెలుస్తుంది.