మందుబాబులకు గుడ్ న్యూస్ చెబుతున్న పోలీసులు. ఇక నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదట. ఆ సమయంలో మాత్రమే.. ??

మందు అలవాటు ఉన్న వారికి సమయానికి ఆ చుక్క గొంతులోకి దిగకుంటే మనస్సు తెగ లాగేస్తుంటుంది.అలాగని తాగి బండి నడిపితే పోలీసులతో తంటా.

 Police Telling Good News To Alcohal Addicts, Police Telling, Good News, Alcohal-TeluguStop.com

మరి ఈ సమస్యకు పరిష్కారంగా ఇంటికి తీసుకెళ్లి తాగుదామంటే ఇంటి వాళ్లతో గొడవ.

ఇక తాగిన వారిని పట్టుకోవడానికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ రోడ్ల మీద అడ్డ పెడతారు.

దీని వల్ల మందు తాగని వారు, అలవాటు లేని వారు కూడా ఇబ్బంది పడుతున్నారు.మరి ఈ సమస్యను అర్ధం చేసుకున్న పోలీసులు డ్రైవ్ పరీక్షల సమయాన్ని మార్చారు.రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారట.మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్ల పైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించినట్టు ట్రాఫిక్ పోలీస్ వర్గాలు తెలిపాయి.

అంటే ఇదివరకట్లా సాయంత్రం 7.30 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయరన్న మాట.విన్నారా మందు బాబులు తాగితే మాత్రం రాత్రి 9గంటల లోపల ఇళ్లు చేరితే ఎలాంటి చలానాలు ఉండవన్నమాట.మరి పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube