మెగాస్టార్ ఇంటి వద్ద భారీ బలగాలు పహారా...

ప్రస్తుత కాలంలో కొందరు మంచి వ్యక్తుల ముసుగులో సోషల్ మీడియాలో చలామణి అవుతూ సెలబ్రిటీల పై పలు అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మెగా స్టార్ చిరంజీవి ఇంటి ని ముట్టడిస్తున్నామని కొందరు జేఏసీ నేతల ముసుగులో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

 Police Strict Protection At Megastar Chiranjeevi Home-TeluguStop.com

విషయం తెలుసుకున్న పోలీసులు ఈ రోజున హైదరాబాద్ నగరంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం ఉంటున్నటివంటి ఇంటి వద్ద అ పోలీసులు తమ బలగాలతో భారీగా గస్తీ నిర్వహించారు.అంతేగాక దాదాపుగా కిలోమీటర్ దూరం వరకూ ఎవరు చిరంజీవి ఇంటి దరిదాపుల్లోకి రాకుండా బారికేడ్లు, చెకింగ్ లు నిర్వహించారు.

దీంతో విషయం తెలుసుకున్న పలువురు జేఏసీ నేతలు ఈ విషయంపై వివరణ ఇస్తూ తాము అధికారికంగా చిరంజీవి ఇంటిని ముట్టడించేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఇదంతా కేవలం ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జేఏసీ నేతల ముసుగులో అసత్య ప్రచారం చేసి పోలీసులకు తప్పుడు సమాచారం అందించారని వాపోతున్నారు.దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయం గురించి ఆరా తీయాలంటూ సమాచారాన్ని అందించారు.

 Police Strict Protection At Megastar Chiranjeevi Home-మెగాస్టార్ ఇంటి వద్ద భారీ బలగాలు పహారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అనే అంశానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.అందువల్లనే జేఏసీ నేతలు కొందరు మెగాస్టార్ చిరంజీవి ఇంటిని ముట్టడించాలని పన్నాగం పొందినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది.

#ChiranjeeviHome

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు