కత్తికి అక్కడ కూడా సమస్యలే.. ఇంకా ఎక్కడకు వెళ్తాడో?     2018-07-17   09:42:46  IST  Ramesh Palla

కత్తి మహేష్‌ వల్ల హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనే ఉద్దేశ్యంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆయన్ను నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. రామాయణం మరియు రాముడిపై ఈయన చేస్తున్న విమర్శలకు హిందు సంఘం నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. దాంతో పాటు ఆయనపై దాడికి కూడా ప్రయత్నించే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు కత్తి మహేష్‌ను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేయడం జరిగింది. కత్తి మహేష్‌ను ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు పోలీసులకు అప్పగించడం జరిగింది.

గత వారం పది రోజులుగా కాస్త సైలెంట్‌గా ఉన్న కత్తి మహేష్‌ తాజాగా మళ్లీ తన నోరు విప్పేందుకు సిద్దం అయ్యాడు. తన బహిష్కరణ మరియు ఇతరత్ర విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు అంటూ ప్రెస్‌ మీట్‌కు పిలుపునిచ్చాడు. కత్తి మహేష్‌ ప్రెస్‌మీట్‌కు మీడియా సిద్దం అవుతున్న సమయంలో పోలీసులు ప్రెస్‌మీట్‌కు అనుమతించేందుకు నో చెప్పింది. కత్తి మహేష్‌ మీడియాతో మాట్లాడేందుకు నో చెప్పిన పోలీసులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాని కత్తి మహేష్‌ మాత్రం మీడియాతో మాట్లాడి తీరుతాను అంటూ పట్టుబట్టడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Police Stop Kathi Mahesh Press Meet In Chittoor-

Police Stop Kathi Mahesh Press Meet In Chittoor

కత్తి మహేష్‌ను చిత్తూరు జిల్లా పోలీసులు నిర్భందించినట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కత్తి మహేష్‌ మీడియా సమావేశంకు నో చెప్పిన విషయం నిజమే కాని, ఆయన్ను నిర్బందించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆయన్ను అరెస్ట్‌ చేయలేదని, మీడియా సమావేశంకు మాత్రం అనుమతించొద్దు అంటూ ఉన్నతాధికారులు చెప్పడం వ్ల తాము కత్తి మహేష్‌కు నో చెప్పాం అంటూ చిత్తూరు జిల్లా ఎస్పీ చెప్పుకొచ్చారు. సొంత జిల్లాకు వెళ్లినా కూడా కత్తి మహేష్‌కు నిర్భందం తప్పడం లేదు. అక్కడ కూడా స్వేచ్చను కలిగి లేడు.

ఏపీ పోలీసులు కూడా ఏదో ఒక సమయంలో కత్తి మహేష్‌ను బహిష్కరించినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కత్తి మహేష్‌కు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. చిత్తూరులో కూడా కత్తి మహేష్‌ ఓవర్‌ యాక్షన్‌ చేస్తే ఈసారి ఆయన్ను బెంగళూరు పంపించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే కత్తి మహేష్‌ బెంగళూరు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేయాలని భావిస్తున్నాడు. అందుకే ఏపీలోనే ఉండేలా కత్తి ప్రయత్నం చేస్తాడు.