దొంగలని పట్టించిన చిన్న పేపర్ ముక్క... ఎలాగంటే.. ?

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “ఆగడు” చిత్రంలో మహేష్ బాబు చెప్పినటువంటి సినిమాల ప్రభావం మాత్రం జనాలపై బాగా ఉందని డైలాగ్ కొన్ని విషయాలు తెలిస్తే నిజమేనని అనిపిస్తుంది.తాజాగా ఇద్దరు యువకులు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “జులాయి” చిత్రాన్ని చూసి దొంగతనం చేసి పోలీసులకు దొరికి పోయారు.

 Police Solve The Money Theft Case Through One Paper Easy In Guntur, Money Theft-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పరిసర ప్రాంతంలో ఇద్దరు యువకులునివాసముంటున్నారు.అయితే వీరు కుటుంబ పోషణ నిమిత్తమై పందులు పెంచుతూ వాటిని అమ్ముతూ ఉండేవారు.తాజాగా ఈ ఇద్దరూ యువకులు మరో ఇద్దరితో కలిసి దాచేపల్లి లో ఉన్నటువంటి ఎస్బిఐ బ్యాంకులో దాదాపుగా 77 లక్షల రూపాయలు సొమ్ముని దొంగతనం చేశారు.ఇందులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు.

కానీ చివరికి ఓ దొంగ జేబులో నుంచి కింద పడినటువంటి పేపర్ ని పోలీసులు కనుగొన్నారు.

దీంతో రంగంలోకి దిగిన  పోలీసులు కాగితం పై ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేసి ఈ నేరానికి పాల్పడిన  ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తనతో పాటు ఈ నేరంలో పాల్గొన్న మిగిలిన నిందితుల పేర్లను పూసగుచ్చినట్లు చెప్పాడు.

ఇంకేముంది చివరికి మిగిలిన వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని దొంగతనం జరిగిన సొమ్ముని రికవరీ చేసి బ్యాంకు అధికారులకు అప్పగించారు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాక ఈ దొంగలు జులాయి సినిమా మొత్తం చూసి క్లైమాక్స్ చూడడం మర్చిపోయినట్టున్నారని  కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube