8 కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు..!!

ఒడిశా రాష్ట్రంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.దాదాపు ఎనిమిది కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను వారి దగ్గర నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసులు కోరాపుట్ జిల్లాలోని పొటాంగి పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే పై .తనిఖీ చేస్తూ ఉండగా చత్తీస్‌గడ్ నుండి రాయపూర్ నుండి విశాఖపట్నం వైపు వాహనంలో పెద్ద ఎత్తున ఈ నకిలీ నోట్లు ఉండటాన్ని పోలీసులు గమనించటం తో వెంటనే .కారులో ఉన్న ముగ్గురు యువకులను డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.

Telugu Chatisgarh, Odisha, Rayapur, Vishakapatanam-Latest News - Telugu

పట్టుబడిన వాళ్లు చత్తీస్‌గడ్ లోని జంజాగిర్ లోని చంపా జిల్లాకు చెందిన వారని తేలింది.ఈ నకిలీ కరెన్సీని విశాఖపట్టణం కి చెందిన వ్యక్తి కి అందజేయడానికి వెళుతున్నట్లు ఒడిషా పోలీసుల విచారణలో తేలింది.ఇదే విషయాన్ని కోరాపుట్ ఎస్పీ గుంటుపల్లి వరుణ్ మీడియాతో తెలిపారు.

త్వరలో విశాఖలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను పెట్టడానికి ఈ నకిలీ కరెన్సీ తెప్పిస్తున్నారు అన్న దానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విశాఖలో .ఎవరు ఆ వ్యక్తి అన్నదానిపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube