గప్ చుప్ గా రాజధాని తరలింపు ?  

Andhra Pradesh DGP Gautam Sawang, Police Quarters, YCP Govt, Rajadhani, Andhra Pradesh, Amaravathi, Visakhapatnam - Telugu Amaravathi, Andhra Pradesh, Andhra Pradesh Dgp Gautam Sawang, Police Quarters, Rajadhani, Visakhapatnam, Ycp Govt

అప్పట్లో మూడు రాజధానులు అంటూ ఏపీ సీఎం జగన్ ప్రకటన చేయగానే, నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.అప్పటి వరకు అమరావతి రాజధాని అంటూ ఆశలు పెట్టుకున్న ఆ ప్రాంత ప్రజలు, రైతులు దాదాపుగా రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిపోయిన జనాలు, అప్పటికే అక్కడ కోట్లాది రూపాయలతో చేపట్టిన భవన నిర్మాణాలు సంగతేంటనే ప్రశ్నలు , ఇప్పటికీ అమరావతిని తరలించ వద్దు అంటూ పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు ఇలా గందరగోళంగా ఏపీ పరిస్థితి ఉంది.

 Police Quarters Visakhapatnam Dgp Gautam Sawang

గత టీడీపీ ప్రభుత్వం సూచించిన అమరావతి రాజధానిని తాము ఎందుకు కొనసాగించాలి అనే పంథంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.అదీ కాకుండా, అమరావతి అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు మేలు చేసేదేనని, తమకు ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో జగన్ అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడం లేదు.

ఇదంతా ఇలా ఉంటే, విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే తలంపుతో జగన్ ముందుకు వెళ్తున్నారు.ఇప్పటికే రాజధానిని తరలించే ప్రక్రియ మరింత వేగవంతం చేశారు.

గప్ చుప్ గా రాజధాని తరలింపు -Political-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలోనే అమరావతి ఉద్యమాన్ని టిడిపి తలకెత్తుకుని గట్టిగా పోరాడేందుకు సిద్ధమవుతోంది.రెండోసారి శాసన మండలి రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం కాకపోయినా రెండోసారి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే చట్ట రూపం దాల్చినట్లు అవుతుందని వైసీపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

అందుకే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసుకుని, తమ కల నెరవేర్చుకోవాలనే ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే అంశంలో భాగంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖలో పోలీస్ క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన భవనాల పరిశీలన వంటి వాటి పూర్తి వివరాలను సేకరించే నిమిత్తం కొద్ది రోజుల క్రితం విశాఖలో పర్యటించారు.

అలాగే మావోయిస్టులు, శాంతిభద్రతల అంశంపైన పరిశీలన చేసేందుకు అప్పట్లో ఆయన పర్యటించారు.ఇంకా పోలీస్ శాఖకు సంబంధించి స్థలాలు, అందుబాటులో ఉన్న భవనాలు వంటి అన్నిటిపైన ఆయన అక్కడ పర్యవేక్షించారు.అదేవిధంగా మిగతా అన్ని శాఖల ఏర్పాటుపైన, పరిపాలన భవనం ఎలా ఉండాలి ? మౌలిక సదుపాయాలు వంటి విషయాల పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి వడివడిగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.టిడిపి ఎంత ఆందోళన చేసినా, అమరావతి పేరుతో హడావుడి చేసేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గకుండా, విశాఖకు రాజధాని తరలింపు చేసి తమ పంతం నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

అందుకే చాపకింద నీరులా రాజధాని తరలింపు ప్రక్రియ సాగుతున్నట్టుగా కనిపిస్తోంది.అదీ కాకుండా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో ఎక్కడా వివాదం చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.

#Police Quarters #Visakhapatnam #Andhra Pradesh #Rajadhani #YCP Govt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Police Quarters Visakhapatnam Dgp Gautam Sawang Related Telugu News,Photos/Pics,Images..