వైరల్‌ : సైకిల్‌ మెకానిక్‌పై 11 ఏళ్ల కుర్రాడు పోలీసులకు ఫిర్యాదు, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Police Pull Up Bicycles Mechanic After 11 Years Boy-bicycles,elimbidad Up School Fifth Class,kerala Kojikode Distict

ఈమద్య చిన్న పిల్లలు మహా ముదురులు అయ్యారని మనం అనుకుంటూనే ఉనానం.సినిమాల ప్రభావం మరియు ఫోన్‌లలో వీడియలో ఇతరత్ర కారణాల వల్ల పిల్లలు కాస్త ముదురుగా ప్రవర్తిస్తున్నారు.కొందరు మహాముదురుగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకొందరు మాత్రం చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు.తాజాగా కేరళలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం పిల్లలు ఎలా ఉన్నారు, వారు ఏ స్థాయిలో యాక్టివ్‌గా ఉంటున్నారు, సోషల్‌ మీడియా ప్రభావం వారిపై ఎలా ఉంది అంటూ చెప్పకనే చెబుతుంది.

Police Pull Up Bicycles Mechanic After 11 Years Boy-bicycles,elimbidad Up School Fifth Class,kerala Kojikode Distict Telugu Viral News Police Pull Up Bicycles Mechanic After 11 Years Boy-bicycles Elim-Police Pull Up Bicycles Mechanic After 11 Years Boy-Bicycles Elimbidad School Fifth Class Kerala Kojikode Distict

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళకు చెందిన కోజికోడ్‌ జిల్లా మెప్పయిర్‌ లోని ఎలింబిదాద్‌ యూపీ స్కూల్‌లో అయిదవ తరగతి చదువుతున్న ఆబిన్‌ అనే కుర్రాడు తన సైకిల్‌ చెడిపోవడంతో సైకిల్‌ మెకానిక్‌కు ఇచ్చాడు.ఆ సైకిల్‌ మెకానిక్‌కు అడ్వాన్స్‌గా 200 రూపాయల రూపాయలను కూడా ఇచ్చాడు.కాని ఆ మెకానిక్‌ రెండు నెలలు అయినా కూడా ఆ సైకిల్‌ను రిపేర్‌ చేయకుండా అదుగో ఇదుగో అంటూ తిప్పుతూ వచ్చాడట.దాంతో ఆబిన్‌కు కోపం వచ్చింది.తన సైకిల్‌ను రిపేర్‌ చేయనందుకు కోపంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.

పోలీస్‌ స్టేషన్‌లో తన చేతులతో ఒక ఫిర్యాదు రాసి ఇచ్చాడు.తన సైకిల్‌ను రెండు నెలలుగా మెకానిక్‌ తన వద్ద ఉంచుకుని ఇవ్వడం లేదు.రెండు వందల రూపాయలు తీసుకుని మరీ అతడు రిపేర్‌ చేయకుండా కాలం గడుపుతున్నాడు.తనకు న్యాయం చేయాలంటూ అబిన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగడం, ఆ పిల్లాడి సైకిల్‌ విషయంలో మెకానిక్‌ను ప్రశ్నించడం, ఒక్క రోజులోనే ఆ మెకానిక్‌ సైకిల్‌ను పూర్తి చేసి ఇవ్వడం చకచక జరిగింది.పోలీసుల వద్దకు వెళ్లిన ఆ పిల్లాడికి న్యాయం జరిగింది.