పోలీస్ పరుగు.. దేనికో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

సాధారణంగా బడికి వెళ్లమంటే పిల్లలు పరుగులు పెడతారు.నిజజీవితంలో ఈ ఘటన చాలా మంది ఎదుర్కొని ఉంటారు.

 Police Protest Against Transfer In Uttar Pradesh-TeluguStop.com

చిన్నప్పుడు బడికి వెళ్లమంటే చాలా మంది ఈ రకమైన పరుగులు పెట్టారు.కానీ తాజాగా ఓ పోలీస్ అధికారి పెట్టిన పరుగులు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆ పోలీస్ అధికారి ఎందుకు పరుగులు పెట్టాడో తెలిస్తే మీరు అవాక్కవ్వడం ఖాయం.

తనను అన్యాయంగా ట్రాన్స్‌ఫర్ చేశారంటూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విజయ్ ప్రతాప్ అనే ఇన్స్‌పెక్టర్ పోలీస్ లైన్ స్టేషన్ నుంచి బిధోలీ పోలీస్ స్టేషన్ వరకు పరుగు పెట్టాడు.

తనను అకారణంగా బదిలీ చేశాడంటూ తన ఇంటి నుండి తనను బదిలీ చేసిన ఠాణా వరకు పరుగు తీశాడు.ఏకంగా 65 కిలోమీటర్లు పరుగు పెట్టిన విజయ్ ప్రతాప్, దారిమధ్యలో మూర్చపోయాడు.

దీంతో అతడు చేపట్టిన నిరసన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

ఇకపోతే విజయ్ ప్రతాప్ బదిలీపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

విజయ్ ప్రతాప్ విషయంలో ఏదైనా అన్యాయం జరిగినట్లు తెలిస్తే అతడికి తప్పక న్యాయం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు.దీంతో విజయ్ ప్రతాప్ చేపట్టిన పరుగు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube