ఆ దేశ ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు పై ఏకంగా పోలీస్ విచారణ..!

ఈ మధ్య చాలా మంది స్కామ్ లు చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.మరికొందరు అయితే భారీ స్కామ్ లు చేసి దేశాన్ని వదిలిపెట్టి పోయిన సందర్భాలు ఉన్నాయి.

 Police Probe On Finland Pm's Breakfast Bill, Finland Pm Sanna Marin, Sanna Marin-TeluguStop.com

ఇదిలా ఉంటే ఓ దేశ ప్రధాన మంత్రి ఓ స్కామ్ లో ఇరుక్కుంటే.ఇక చెప్పనవసరం లేదు.

ఆ దేశంలో నిరసనలు ఏ రీతిలో ఉంటాయోనని.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ కెసరంటాలోని ప్రధాని అధికారిక నివాసంలో తన కుటుంబంతో సహా నివసిస్తారు.తన కుటుంబం కోసం నెలకు ఏకంగా 300 యూరోలను వెచ్చిస్తున్నారు.

ఈ మొత్తాన్ని దేశ ఖజానా నుంచి ఆమె వాడుకుంటున్నట్లు వెల్లడి కావడంతో ఫిన్లాండ్‌లో కలకలం చెలరేగింది.ఫ్యామిలీ బ్రేక్​ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​ కెసరంటాలోని అధికారిక నివాసంలో కుటుంబంతో సహా ఉంటోంది.
అయితే బ్రేక్​ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె క్లెయిమ్​ చేస్తోంది.ఈ మేరకు స్థానిక పత్రిక ఒకటి కథనం ప్రచురించడంతో విపక్షాలు మండిపడుతున్నాయి.

దీంతో సన్నా మారిన్ స్పందించారు.ఒక ప్రధానిగా తాను ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదని, అలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె ట్వీట్​ చేశారు.

నిజానికి నెలకు మూడొందల యూరోలంటే మన దేశ కరెన్సీలో సుమారు 25 వేల రూపాయలు.నెలకు కేవలం 25 వేల రూపాయలను ఓ దేశ ప్రధాని సొంతానికి వినియోగిండమంటే పెద్ద విషయం కాదనే మనం భావిస్తాం.

కానీ ఫిన్నిష్ చట్టాల ప్రకారం ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క యూరోని అక్రమంగా వినియోగించినా నేరంగానే భావిస్తారు.ఇదే ఇప్పుడు సన్నా మారిన్‌కు ఇబ్బందికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube