కరోనాపై ముందుండి పోరాడే పోలీస్ సిబ్బందికి ఇర్వింగ్-డల్లాస్ నగరంలో నాట్స్ భోజన సదుపాయం  

Police Personnel Who Fight In For Corona Im Dallas - Telugu America, Coronavirus, Dallas, Meals For Police, Nats, Police Deportments

అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు.ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

 Police Personnel Who Fight In For Corona Im Dallas

తాజాగా నాట్స్ డాలస్ విభాగం ఇర్వింగ్ పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసింది.నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి చొరవతో స్థానికంగా ఉండే 50 మంది పోలీస్ సిబ్బందికి ఈ మధ్యాహ్నభోజనానికి ఏర్పాట్లు చేసింది.

నాట్స్ సభ్యులే స్వయంగా వెళ్లి.సిద్ధం చేసిన ఆహారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందించారు.

కరోనాపై ముందుండి పోరాడే పోలీస్ సిబ్బందికి ఇర్వింగ్-డల్లాస్ నగరంలో నాట్స్ భోజన సదుపాయం-Telugu NRI-Telugu Tollywood Photo Image

నాట్స్ కాఫీ విత్ కాప్ మరియు నాట్స్ గాంధీ జయంతి వంటి కార్యక్రమాల అనుమతి కోసం గత పదేళ్లుగా స్థానిక పోలీస్ అధికారి జాన్ మిచేల్‌తో బాపు నూతి సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు.ఈ అనుబంధంతో నాట్స్ విందును పోలీస్ అధికారులు అనుమతించడం జరిగింది.పోలీస్ సిబ్బందిని ప్రోత్సాహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని జాన్ మిచేల్ అన్నారు.నాట్స్ టీంను ఆయన ప్రశంసించారు.ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు రాజేంద్ర మాదల, జ్యోతి వనం, కవిత దొడ్డ, శ్రీనివాస్ పాటిబండ్ల, మిలింద్, యూత్ వాలంటీర్లు వరిశ్, ప్రణవి తదితరులు పాల్గొన్నారు.కరోనా పై పోరాడే ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రోత్సాహించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.

నాట్స్ డాలస్ విభాగం ఈ విషయంలో చూపుతున్న చొరవను వారు ప్రశంసించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Police Personnel Who Fight In For Corona Im Dallas Related Telugu News,Photos/Pics,Images..

footer-test