పోలీసులపై ఎదురు కేసులు ..! బాబు పై  ముదురుతున్న వివాదం ?

పోలీసులపై కేసులు పెట్టండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడినట్లు వచ్చిన వీడియో పెద్ద దుమారమే రేపుతోంది.పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి  చంద్రబాబు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ , పోలీసులపై తప్పుడు కేసులు పెట్టండి , పోలీసులే కాళ్లబేరానికి వస్తారని బాబు వ్యాఖ్యానించినట్లుగా వీడియో బయటకు రావడంతో పోలీస్ అధికారుల సంఘం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది.

 Police Officers Union Angry On Chandrababu Comments, Chandrababu Naidu Online Me-TeluguStop.com

చంద్రబాబు వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించడమే అని పోలీస్ అధికారుల సంఘం వ్యాఖ్యానించింది.మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత దిగజారుడు తనంతో మాట్లాడడం తగదని,  ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన వ్యవస్థగా ఉంటూ, ప్రజలకు ప్రత్యక్షంగా ఎన్నో రకాల సేవలు అందిస్తున్న పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు చేయడం తగదని, చట్టాలపై , వ్యవస్థపై నమ్మకం లేదనే విషయాన్ని బాబు వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయని,  పోలీసు అధికారుల సంఘం  విమర్శించింది.

అంతేకాకుండా నేరాన్ని ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు అనే విషయాన్ని బాబు గుర్తించాలని హితవు పలికారు.సామాన్య ప్రజలకు, బలహీనవర్గాలకు పోలీస్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం అనేక టెక్నాలజీ సేవలు పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చింది అని , ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను అందుకుంటూనే , ప్రజలకు సేవ చేస్తున్నామని,  జాతీయ స్థాయిలో అనేక అవార్డులు ఏపీ పోలీస్ సంపాదించినందుకు గర్వపడుతున్నామన్నారు.

Telugu Goutham Savang, Chandrababu, Confrence, Officers-Telugu Political News

ఇటు వంటి పోలీసు వ్యవస్థను అభినందించక పోగా, తమపై విమర్శలు చేస్తూ ,పోలీసుల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని, ప్రతి విషయంలోనూ, పోలీసులను నిందిస్తూ, వారిపై విమర్శలు చేస్తున్న మీ వ్యాఖ్యలను మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని , కాకపోతే మీ విమర్శలకు పోలీసులు ఎవరూ బెదిరేది లేదని, పోలీసు శాఖ సేవలను మీరు అభినందించకపోయినా, కనీసం గుర్తించాలంటూ ఆ సంఘం నాయకులు చంద్రబాబు కు హితవు పలకడంతో ఈ వ్యవహారం  హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube