హనీప్రీత్ లో ఈకోణం చూసి షాక్ అయ్యిన పోలీసులు   Police Officers Shocking For Honeypreet Background     2017-10-05   04:53:25  IST  Raghu V

గుర్మిత్ సింగ్ విషయం ఏమో కానీ…దత్తపుత్రిక గా చెప్పుకుంటున్న హనీ ప్రీత్ సింగ్ మటుకూ పోలీసులకి దొరకకుండా చుక్కలు చూపించింది. తానూ ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నట్టు..అసలు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటానికి చాలా పెద్ద కారణమే ఉందట కొందరు అధికారుల సహాయంతో పోలీసుల నీడ తనపై పడకుండా హనీప్రిత్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడిందట అంటే తనకి ఎంత నెట్వర్క్ ఉందొ చెప్పచ్చు.

ఇప్పుడు ఆమె మీద ఉన్న ఒక బలమైన ఆరోపణ ఏమిటి అంటే. హెలికాఫ్టర్ బయల్దేరాక గుర్మీత్ తో పారిపోయేందుకు దాన్ని దారి మళ్లించే ప్రయత్నం హనీప్రిత్ చేశారన్న అభియోగాలు ఇప్పుడు ఆమె కేసులో వున్నాయి . దీనికి సంబంధించి కాక్ పీట్ లో జరిగిన సంభాషణ న్యాయస్థానం ముందు సాక్ష్యంగా పెడితే తాను గుర్మీత్ అమాయకులమని మీడియా కు కోర్టు కి చెప్పిన ఆమె బండారం బయటపడుతుందంటున్నారు.

అంతేకాదు దేశంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ పాకిస్థాన్ నుంచి ప్రవేశించే ప్రాంతాలు పంజాబ్ , హర్యానా . ఇక్కడ నుంచే డ్రగ్స్ మాఫియా దేశం అంతా వీటిని సప్లయి చేస్తుందని. అలాంటి అడ్డాలో బయట ప్రపంచానికి తానో దేవుడిగా స్వయంగా ప్రకటించుకుని డేరా సచ్చా సౌధ లో చీకటి సామ్రాజ్యాన్ని సృష్ట్టించిన గుర్మీత్ చక చక వేలకోట్ల కు పడగలెత్తడం వెనుక డ్రగ్స్ మాఫియా కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి.ఇప్పుడు ఆర్ధికంగా వచ్చిన తేడాల్లో పాకిస్థాన్ మాఫియా డేరా బాబా,హనీప్రీత్ లమీద పగతీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయట.

డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంభందాలవల్లనే..ఇప్పుడు వారికి కనపడకుండా తప్పించుకుని తిరుగుతోందని అందుకే లొంగిపోయింది అని నిఘావర్గాలు చెప్తున్నారు. అక్టోబర్ 10 వరకు కస్టడీలో పెట్టుకుని విచారించనున్న నేపథ్యంలో ఆమె వారికి ఈ అంశాలపై ఎంతవరకు సమాచారం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే కోర్టులో హనీప్రీత్ కనీసం నోరుకుడా మెదపలేదట..దీంతో ఇప్పుడు పోలీసులు కష్టడీలో హనీ ఎటువంటి నిజాలని వేల్లదిస్తుందా అని వేచిచూస్తున్నారు.

,