జార్జ్ ని చంపిన అధికారికి దెబ్బ మీద దెబ్బ…సంచలన నిర్ణయం తీసుకున్న భార్య..!!!  

Police Officer Wife Divorce George Death - Telugu America, Divorce, George Floyd, Police Officer, Protesters, Wife

జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప్రపంచ వ్యాప్తంగా అందరిని కలిచి వేస్తోంది.అతడి మృతికి కారణమైన పోలీసు అధికారి చౌవిన్ పై చర్యలు తీసుకుని అతడిని ఉరి తీయాలని నిరసన కారులు ఆందోళన చేస్తున్నారు.

 Police Officer Wife Divorce George Death

ఈ నిరసనలు రోజు రోజుకి ఉదృతం అవుతున్నాయి.వీరిని అదుపు చేయడం ఎవరి వల్లా కావడంలేదు.

ఊహించని ఈ పరిణామాలపై పోలీసు అధికారులకి ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.ఇదిలాఉంటే జార్జ్ ని చంపిన పోలీసు అధికారిని ప్రభుత్వం శిక్ష వేసేలోగానే అతడి భార్య ముందుగానే శిక్షించింది.

జార్జ్ ని చంపిన అధికారికి దెబ్బ మీద దెబ్బ…సంచలన నిర్ణయం తీసుకున్న భార్య..-Telugu NRI-Telugu Tollywood Photo Image

రెండు రోజుల క్రితం జార్జ్ ని చంపిన తన భర్త చౌవిన్ నుంచీ తనకి విడాకులు కావాలని కీలై కోర్టుని ఆశ్రయించిన విషయం విధితమే.ఈ ఘటనతో అతడు సగం చచ్చినట్టే అంటూ మీడియా మొత్తం కోడై కూసింది.

ఇదిలాఉంటే తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుంది.తన పేరు కీలై తన పేరు చివర చౌవిన్ అని ఉంటుంది దయచేసి నా పేరు చివర ఉన్న చౌవిన్ పదాన్ని తొలగించండి ఇది నాకు ఎంతో అవమానంగా ఉంటోంది.నేను నా భర్త నుంచీ విడిపోవాలని అనుకున్న సమయంలో ఆ పేరు నాకు అవసరం లేదు అంటూ ఒక పిటిషన్ కోర్టులో వేసింది.అంతేకాదు…

మా ఇద్దరి పేరుపై ఆస్తులు ఉన్నాయి.వాటిని ఇద్దరికీ సమానంగా పంచండి అంటూ మరొక పిటిషన్ వేసింది.విడాకులు ఇచ్చిన తరువాత తానూ ఒంటరి జీవితం గడపాలని అనుకుంటున్నాను శాశ్వతంగా ఇద్దరినీ విడదీయండి అంటూ ఆమె వేసిన పిటిషన్ అమెరికా వ్యాప్తంగా సంచలన సృష్టించింది.

ఈ ఇద్దరికీ 2010 లో వివాహం జరిగిందని ఎంతో సంతోషంగా ఇద్దరూ ఉండేవారని తెలుస్తోంది.కానీ తన భర్త అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని చంపడంతో అతడి నుంచీ దూరంగా వెళ్ళిపోవాలని ఆమె నిర్ణయం తీసుకుందని ఆమె అమెరికాలో సూపర్ మహిళ అంటూ స్థానిక మీడియా ప్రచారం చేస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Police Officer Wife Divorce George Death Related Telugu News,Photos/Pics,Images..

footer-test