పోలీస్ ని చంపిన పందెం కోడి.. ఎక్కడో తెలుసా?  

Philippines fighting cock kills police officer , fighting cock,killed,police officer,San Jose Municipal Police Station,Christian Bolok - Telugu Christian Bolok, Fighting Cock, Killed, Police Officer, San Jose Municipal Police Station

మనదేశంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు. కోడి పందాలు నిర్వహిస్తుంటారు.

TeluguStop.com - Police Officer Died Cockfight Raid

కొన్ని కోట్ల రూపాయల బెట్టింగులు కాస్తూ కోడిపందాలను నిర్వహిస్తుంటారు.కోడి పందేల కోసం కోడిపుంజులకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇస్తూ, పందేనికి శిక్షణ కూడా ఇస్తుంటారు.

మనదేశంలో కోడి పందానికి అంత ప్రాముఖ్యత ఉంది.కోడి కాళ్లకు కత్తులు కట్టి, ఒకదాని పై ఒకటి చెలరేగుతుంటే ఎంతో హుషారుగా ఈ ఆటను నిర్వహిస్తుంటారు.

TeluguStop.com - పోలీస్ ని చంపిన పందెం కోడి.. ఎక్కడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

కేవలం మన దేశంలోనే కాకుండా ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కూడా కోడి పందేలను జోరు గా నిర్వహిస్తారు.

కరోనా కారణం వల్ల ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కోడి పందాలను నిషేధించింది.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఉత్తర సమర్ ప్రాంతంలో కోడి పందాలను జోరుగా నిర్వహించారు.ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు శాన్ జోస్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న క్రిస్టియన్ బోలోక్ తన సిబ్బందిని వెంట తీసుకొని ఉత్తర సమర్ ప్రాంతంపై దాడి చేసి, కోడి పందాల రాయుళ్లను ముగ్గురిని అరెస్టు చేశారు.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలు నిర్వహించారన్న ఆధారంగా రెండు కోడిపుంజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే పోలీస్ అధికారులలో క్రిస్టియన్ బోలోక్ అనే అధికారి కోడిపుంజును పట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో కోడిపుంజు కాలుకి ఉన్న పదునైన కత్తి పోలీస్ అధికారి ఎడమకాలి తొడ భాగానికి లోతుగా గీసుకోవడం ద్వారా, రక్తనాళాలు తెగి అధిక రక్తస్రావం కావడంతో ఆ పోలీస్ అధికారి ప్రాణాలను కోల్పోయాడు.ఈ విషాద ఘటన పోలీస్ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

కోడి కత్తి తగిలి ప్రాణాలు విడిచిన పోలీస్ అధికారికి, పోలీస్ శాఖ వారు ఘన నివాళులు అర్పించారు.బోలోక్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

#Killed #Police Officer #Christian Bolok #SanJose #Fighting Cock

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Police Officer Died Cockfight Raid Related Telugu News,Photos/Pics,Images..