రకుల్ చేసిన నేరమిదే.. అరెస్ట్ తప్పదంటున్న న్యాయ నిపుణులు?  

Police May Arrest Rakul Preet Singh in Drugs Case, Rakul Preet Singh ,NCB officials, Drugs Case, Deepika Padukone, Rakul Drugs Chat, Karan Johar - Telugu Deepika Padukone, Drugs Case, Karan Johar, Mumbai Ncb, Ncb Officials, Police May Arrest Rakul Preet Singh In Drugs Case, Rakul Drugs Chat, Rakul Preet Singh, Rhea Chakraborthy

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఒక తప్పు వల్ల ఆమె అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.నిన్న ఎన్సీబీ అధికారుల విచారణలో తాను డ్రగ్స్ తీసుకోలేదని.

TeluguStop.com - Police May Arrest Rakul Preet Singh In Drugs Case

ఇంట్లో డ్రగ్స్ దాచడం మాత్రం వాస్తవమేనని రకుల్ తెలిపింది.అయితే న్యాయ నిపుణులు డ్రగ్స్ తీసుకోవడం కంటే డ్రగ్స్ దాచడం పెద్ద నేరమని చెబుతున్నారు.

ఆమె విచారణలో డ్రగ్స్ దాచినట్టు చెప్పి ఉంటే అరెస్ట్ కాక తప్పదని పేర్కొంటున్నారు.

TeluguStop.com - రకుల్ చేసిన నేరమిదే.. అరెస్ట్ తప్పదంటున్న న్యాయ నిపుణులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎన్డీపీఎస్ చట్టం 8(సి) చట్టం ప్రకారం రకుల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

రకుల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆమె అరెస్ట్ విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.రకుల్ డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించగా మరో హీరోయిన్ దీపికా పదుకొనే సైతం డ్రగ్స్ చాట్ చేసినట్టు ఒప్పుకుంది.

రకుల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నలుగురి పేర్లను వెల్లడించిందని త్వరలో సమన్లు జారీ చేసి వారిని కూడా అధికారులు విచారించనున్నారని సమాచారం.
మరోవైపు ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కంపెనీకి చెందిన రవి అరెస్ట్ కావడంతో కరణ్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులందరూ పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదని తెలుస్తోంది.

ఈ కేసులో మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు హీరోయిన్ల పేర్లు వెలుగులోకి రావడంతో ఇప్పటికే ఈ హీరోయిన్లకు సినిమాల కోసం అడ్వాన్సులిచ్చిన నిర్మాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.ఈ డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

#PoliceMay #NCB Officials #Drugs Case #Mumbai Ncb #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Police May Arrest Rakul Preet Singh In Drugs Case Related Telugu News,Photos/Pics,Images..