లైవ్ మ్యాచ్‌లోకి స‌డెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. న‌లుగురు ఆట‌గాళ్ల అరెస్టు..

ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ అర్జెంటీనా, బ్రెజిల్ మధ్యప్రారంభమైన ప‌ది నిమిషాల తర్వాత గ్రౌండ్‌లోకి పోలీసులు, ఆరోగ్య కార్యకర్తల టీంలు రంగప్రవేశం చేశారు.అందులో నలుగురు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

 Police Make Sudden Entry Into Live Match .. Four Players Arrested  , Police In G-TeluguStop.com

దీంతో అందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.ఆదివారం రాత్రి జరిగింది.

ఈ ఘటన వల్ల మ్యాచ్ ను రద్దు చేశారు.అయితే అదుపులోకి తీసుకున్న నలుగురు ఆటగాళ్లు అర్జెంటీనాకు చెందినవారే.

వారిలో రొమెరో, బుయెండియామార్టినెజ్, జియోవన్నీ, వీరు కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇది ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌.

దీనికి ముందు నలుగురు అర్జెంటీనా ఆటగాళ్లను బ్రెజిల్ హెల్త్ డిపార్ట్ మెంట్ ప‌ది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరింది.కానీ వీళ్లు కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి డైరెక్ట్‌గా ఇంగ్లాండ్ నుంచి బ్రెజిల్‌కు వెళ్లి ప్రీమియర్ లీగ్‌లో ఆడారు.

అయితే మ్యాచ్‌ జరుగుతుండగా ఆ నలుగురు ఆటగాళ్లను గ్రౌండ్‌లోకి ఆరోగ్య కార్యకర్తలు, పోలీసుల బృందం వెళ్లి గుర్తించారు.అయితే మ్యాచ్ రద్దయిన త‌రువాత బ్రెజిల్,అర్జెంటీనా ఆటగాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపించింది.

0-0తో స్కోరు మ్యాచ్ రద్దు అయినపుడు సమానంగా ఉంది.ఇప్పుడు ఈ విష‌యంపై తీవ్ర విమర్శలు విన‌ప‌డుతున్నాయి.

ప్లేయ‌ర్స్ ఇలా చేయడం పద్దతి కాదని మాజీలు విమర్శిలు గుప్పిస్తున్నారు.

Telugu Arganteena, Brazel, Corona, England, Ground-Latest News - Telugu

కరోనా వల్ల చాలామంది మృతి చెందుతుంటే ఆటగాళ్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం స‌రైందికాదన్నారు.క్వారంటైన్ నిబంధనలు, ప్రోటోకాల్స్ క‌చ్చితంగా పాటించాలని సూచించారు.ఆ ఆటగాళ్లపై నిషేధం విధించాలని హెచ్చరించారు.

దీని వ‌ల్ల మిగితా ఆట‌గాళ్ల‌కు ఇబ్బంది ఎదుర‌వుతోందని ప్రేక్ష‌కులు తిట్టిపోశారు.ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ కాకుండా ఉండాలంటే ఆ న‌లుగురిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రేక్ష‌కులు కోరారు.

టిక్కెట్లు కొన్న వారు అసంతృప్తి గుర‌య్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube