లాక్ డౌన్ ని పాటించని జనాలు.... తుక్కు రెగ్గొడుతున్న పోలీసులు...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నీ లాక్ డోన్ ని 12వ తారీకు వరకు అంటే దాదాపు 21 రోజుల పాటు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Police Lathi Charge On Peoples In Both Telugu States, Police Lathi Charge, Andhr-TeluguStop.com

అయితే ప్రజలు మాత్రం ఈ లాక్ డౌన్ ని బేఖాతరు చేయడం లేదు.

ఎప్పటిలాగే యధావిధిగా రోడ్లపై తిరుగుతుండడంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.

అంతేకాక తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై సంచారం చేస్తే  షూట్ అవుట్ సైడ్ ఆర్డర్ పాస్ చేస్తామని కూడా హెచ్చరించారు.ఇది జనహితం కోరి చెబుతున్నామని దీనివల్ల అందరూ బాగుపడతారని కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితులలో తప్ప అనవసరంగా బయటకి రావద్దంటూ సూచించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చెబుతున్నప్పటికీ జనాలు మాత్రం వినడం లేదు.దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేస్తూ రెచ్చిపోతున్నారు.ఈ లాఠీ చార్జికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Andhra Pradesh, Lock, Lathi Charge, Lathicharge, Telangana Lock-Latest Ne

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఉన్నట్లుండి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కార్యక్రమం చేపట్టడంతో జన సాంద్రత ఎక్కడిక్కడే స్తంభించి పోయింది.అలాగే పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చినటువంటి ప్రజలు కూడా తిరిగి తమ సొంతూళ్లకు వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.మరి కొంతమంది దూర ప్రాంతాలకు చెందిన వారైతే ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది.

అలాగే చదువులు, ఉద్యోగాల నిమిత్తమై పట్టణాల్లో హాస్టల్స్ లో నివాసం ఉంటున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.లాక్ డౌన్ కారణంగా హాస్టల్ లో భోజన సదుపాయం లేక, ఇటు బయట కూడా ఎటువంటి భోజనం దొరకక పస్తులతో రోజులు గడుపుతున్నారు.

దీంతో కొందరు కనీసం తమ ఊర్లకు చేరుకునెంత వరకూ అయినా ఈ లాక్ డౌన్లోడ్ ని సడలించాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube