ఆరేళ్ల పిల్లాడు గీసిన స్కెచ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు..!

ఎవరైనా పోలీసులు కేసును ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆ సంఘటనకు సంబంధించి ఆధారాలు కలెక్ట్ చేసి ఆ తర్వాత ఆ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు.ఇందులో భాగంగానే నిందితులను పట్టుకోవడానికి అప్పుడప్పుడు పోలీసులు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పే ఆధారాలతో బొమ్మలను కూడా గియిస్తుంటారు.

 Accident, Case, Police, Investigation, Car, Driving, Lady, 6 Years Boy, Professi-TeluguStop.com

ఇలా గీసిన బొమ్మలతో నిందితులను పట్టుకోవడానికి ప్రయతిస్తారు పోలీసులు.నిందితుల ఊహాచిత్రాలను ప్రొఫెషనల్ స్కెచ్ వేసేవాళ్ళతో గీయిస్తారు.

ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా ఓ ఆరు సంవత్సరాల బాలుడు గీసిన ఊహాచిత్రాలను తీసుకుని ఆ చిత్రాలను ఓ కేసులో కీలక భాగం అంటూ వాటిని జోడించారు.ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా పోలీసులే స్వయంగా వారి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆ ట్వీట్ లో ఆరేళ్ల చిన్నారిని గీసిన చిత్రాలు లను కలిపి పోస్ట్ చేశారు.ఆరేళ్ళ చిన్నారి గీసిన చిత్రాలు ఎలా ఉంటాయి చెప్పండి.ఏదో పిల్లలు వేసుకొనే బొమ్మలు లాగే గీసిన వాటిని కూడా ఆధారాలుగా తీసుకోవడం నిజ్జంగా ఆశ్చర్యం వేస్తుంది.

నిజానికి అక్కడ జరిగిన సంఘటన విషయానికి వస్తే.ఓ మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు పక్కన ఉండే బ్యారియర్‌ లను గుద్దేసి అక్కడినుంచి వెళ్లిపోయింది.దాంతో ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని తాము ప్రయత్నిస్తున్నట్లు.

అందుకే ఈ స్కెచ్ లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు.అయితే ఈ కేసు కు సంబంధించి ఆ పిల్లాడు గీసిన చిత్రాలను ఆధారంగా చేసుకుంటున్నారు.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు.ఆ సంఘటనకు ఆ ఆరేళ్ళ చిన్నారి ప్రత్యక్ష సాక్షి కాబట్టి అంటూ పోలీసులు వారి ట్వీట్ లో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube