సెకండ్ హ్యాండ్ ఫోన్.. ఒక రోజంతా ఆ మహిళ?

కరోనా మహమ్మారి మనదేశంలోకి వ్యాపించి రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలకు చెందిన సమస్థలు మూతపడ్డాయి.

 Police Helps Women Who Bought Stolen Phone Mumbai,women,stolen Phone,second Hand-TeluguStop.com

దీంతో కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు, స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నాయి.కానీ ఆన్లైన్ తరగతులను వినాలంటే అందుకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ కచ్చితంగా ఉండాలి.

ఈ నేపథ్యంలోనే తన కొడుకు ఆన్లైన్ తరగతులను మిస్ కాకుండా ఉండాలని ఓ తల్లి ఎంతో కష్టపడి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనిచ్చింది.అయితే ఆ ఫోన్ కొన్నందుకు గాను ఆమెను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

ముంబై నగరంలోని బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్‌ సావ్రే తన కుమారుడిఆన్లైన్ చదువుల కోసం మూడు నెలల నుంచి కష్టపడి ఒక సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ ను ఆరు వేల రూపాయలకు కొనింది.తరువాత దానిని రిపేరు చేయించడానికి దాదాపు 1500 రూపాయలు ఖర్చు చేసి తన కుమారుడికి ఇచ్చింది.

అయితే ఈ ఫోన్ ను వాడిన మరుసటి రోజే తన ఇంటికి పోలీసులు వచ్చి ఆ మహిళను అరెస్టు చేశారు.

ఆ మహిళ కొన్న సెకండ్ హ్యాండిల్ ఫోన్ దొంగతనం చేసినది కావడంతో ఆమెను ఒక రోజంతా స్టేషన్ లో ఉంచి విచారణ చేపట్టిన పోలీసులు ఆమెకు ఆ దొంగతనంతో ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో ఆమెను వదిలి పెట్టారు.

ఎంతో కష్టపడి కొన్న ఫోను లేకపోవడంతో తన కుమారుడు చదువుకు ఆటంకం ఏర్పడే పరిస్థితి వచ్చిందని ఆమె తన ఇంటి యజమానికి చెప్పడంతో అతను ఈ విషయాన్ని ముంబై పోలీసులకు తెలియజేశాడు.ఈ విషయంపై స్పందించిన ఉన్నతాధికారులు తన కొడుకు ఉన్నత చదువుల కోసం

స్వాతికి ఒక కొత్త ఫోను

బహుమతిగా ఇచ్చి వారి గొప్ప మనసును చాటుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube