నిఖిల్ నైట్ పార్టీని అడ్డుకున్న పోలీసులు ?  

Police Had To Stop Nikhil’s Late Night Party In Hyderabad ?-

ఓ సినిమా సక్సెస్ అయితే హీరోకి దక్కే ఆనందమే వేరు.అగ్రహీరోలకి కలెక్షన్లు ఎలాగో అలవాటు కాబట్టి పెద్దగా పార్టీలు విసరడం అలాంటివి జరగకపోవచ్చు కాని, యువ హీరోలకి మంచి సక్సెస్ దొరికితే ఆ కిక్కే వేరు.ప్రస్తుతం నిఖిల్ గాల్లో తెలిపోతున్నాడు.ఎక్కడికి పోతావు చిన్నవాడ బంపర్ సక్సెస్ ని అందుకుంది.

Police Had To Stop Nikhil’s Late Night Party In Hyderabad ?--Telugu Gossips Police Had To Stop Nikhil’s Late Night Party In Hyderabad ?---

ఇండియా, ఓవర్సీస్ తేడా లేకుండా మంచి కలెక్షన్లు రాబడుతోంది.ఇంకేం, రాకరాక ఇంతపెద్ద హిట్ వస్తే హీరో సంబరాలు ఎలా ఉంటాయి.సినిమా హిట్ అయినందుకు ఫ్రెండ్స్ కి పెద్ద పార్టీ ఇచ్చాడట నిఖిల్.ఇస్తే ఇచ్చాడు కాని వారి పార్టీ రాత్రి గడుస్తున్న సాగుతూనే ఉందట.

ఆ సమయంలో వీళ్ళు చేసే అల్లరి కాస్త డిస్టర్ బెన్స్ గానే ఉంటుంది కదా.పోలీసులకి ఎవరైనా చెప్పారో లేక, వారే తెలుసుకున్నారో, వచ్చి పార్టీని ఆపేశారట.ఎంజాయ్ చేసింది చాలు, ఇక వెళ్ళండి అంటూ నిఖిల్ ని, తన స్నేహితులని ఇంటికి పంపించేసారట.ఇందులో నిజానిజాలు సరిగా తెలియవు కాని, ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న తాజా కబుర్లలో ఇది కూడా ఒకటి.

నిజమే అనుకున్నా, నిఖిల్ చేసిన తప్పేముంది.యువహీరోకి దొరకాల్సిన హిట్ దొరికితే ఆ మాత్రం హంగామా ఉంటుంది కదా.